Janasena Kiran Rayal: వీడియో ఇదిగో, లైంగిక ఆరోపణల వివాదంపై స్పందించిన జనసేన నేత కిరణ్ రాయల్, మా ఇద్దరి మధ్య ఆ సంబంధం మాత్రమే ఉందని వెల్లడి
తనపై వచ్చిన లైంగిక ఆరోపణల వివాదంపై తాజాగా జనసేన నేత కిరణ్ రాయల్ సంచలన విషయాలు వెల్లడించారు. తనకు, లక్ష్మీరెడ్డికి ఆర్థిక లావాదేవీలు మాత్రమే ఉన్నాయని, అంతకుమించి మరొకటి లేదని వివరించారు. తనపై ఎవరు కుట్ర చేశారో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దగ్గర ఆధారాలతో సహా ఉంచుతా అని తిరుపతి జనసేన ఇన్ చార్జ్ కిరణ్ రాయల్ అన్నారు.

తాను ఏ తప్పు చేయలేదు అని పవన్ గారికి తెలిసి విచారణ చేయమన్నారని చెప్పారు. క్లీన్ చిట్‌తో మళ్లీ నేషనల్ హైవేలా దుసుకుపోతా అని ధీమా వ్యక్తం చేశారు. తన జీవితాంతం పవన్ కళ్యాణ్, మీడియాకు రుణపడి ఉంటానని అని పేర్కొన్నారు. తనకు, లక్ష్మి రెడ్డికి ఆర్థిక లావాదేవీలు మాత్రమే ఉన్నాయని కిరణ్ రాయల్ చెప్పుకొచ్చారు.ఒక మహిళను రాజకీయాల్లో లాగి అనేక రకాలుగా హింసకు గురి చేశారని చెప్పారు.
తాను మొండోడిని కాబట్టి నిలబడ్డా.. ఇంకెవరైనా అయితే కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంటారని పేర్కొన్నారు.తనపై ఎవరు కుట్ర చేశారో పవన్ కళ్యాణ్ దగ్గర ఆధారాలతో సహా బయటపెడుతానని కిరణ్ రాయల్ స్పష్టంచేశారు. కాగా, కిరణ్ రాయల్ వ్యాఖ్యలపై కొందరు పాజిటివ్‌గా , మరికొందరు నెగెటివ్‌గా స్పందిస్తున్నారు. కాగా తిరుపతి చెందిన లక్ష్మి రెడ్డి, కిరణ్ రాయల్‌మధ్య ఆర్థిక లావాదేవీలపై వివాదం నెలకొన్న విషయం తెలిసిందే.
Janasena Kiran Rayal Response on Laxmi allegations
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)