DK Shivakumar Meets Chandrababu: వీడియో ఇదిగో, చంద్రబాబును కలిసిన డీకే శివకుమార్, పక్కకు వెళ్లి కాసేపు ముచ్చటించుకున్న ఇరువురు నేతలు
తెలుగుదేశం పార్టీ (TDP) అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu), కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Sivakumar)లు గురువారం బెంగళూరు విమానాశ్రయంలో పరస్పరం ఎదురుపడ్డారు.
తెలుగుదేశం పార్టీ (TDP) అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu), కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Sivakumar)లు గురువారం బెంగళూరు విమానాశ్రయంలో పరస్పరం ఎదురుపడ్డారు. కుప్పం వెళ్లేందుకు చంద్రబాబు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లగా.. అదే సమయంలో కాంగ్రెస్ ఆవిర్భావ సభ కోసం నాగ్‌పుర్ వెళ్లేందుకు డీకే శివకుమార్ విమానాశ్రయానికి వచ్చారు.
రెండు విమానాలు పక్కపక్కనే ఉండి.. పరస్పరం ఎదురుకావడంతో (DK Shivakumar Meets Chandrababu) ఇద్దరు నేతలు మర్యాదపూర్వకంగా కరచాలనం చేసుకున్నారు. డీకే శివకుమార్.. చంద్రబాబును పక్కకు తీసుకెళ్లి కాసేపు ముచ్చటించారు. ఇద్దరు నేతలు మర్యాదపూర్వకంగానే కలిశారని, ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని టీడీపీ వర్గాలు వెల్లడించాయి.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)