Posani Krishna Murali Case: పోసాని కృష్టమురళీకి ఊరట, కస్టడీ పిటిషన్ కొట్టివేసిన కర్నూలు జేఎఫ్‌సీఎం కోర్టు, బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్

ప్రముఖ నటుడు, రచయిత, వైసీపీ నేత పోసాని కృష్టమురళీని కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్‌ను కర్నూల్ జేఎఫ్‌సీఎం కోర్టు కొట్టివేసింది. ఈ నెల ఆరో తేదీన జేఎఫ్‌సీఎం కోర్టులో ఆదోని పోలీసులు కస్టడీ పిటిషన్ వేశారు. పోసానిని విచారించే క్రమంలో కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు

Posani Krishna Murali in custody of Narasaraopet police

Vjy, Mar 10: ప్రముఖ నటుడు, రచయిత, వైసీపీ నేత పోసాని కృష్టమురళీని కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్‌ను కర్నూల్ జేఎఫ్‌సీఎం కోర్టు కొట్టివేసింది. ఈ నెల ఆరో తేదీన జేఎఫ్‌సీఎం కోర్టులో ఆదోని పోలీసులు కస్టడీ పిటిషన్ వేశారు. పోసానిని విచారించే క్రమంలో కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఏడో తేదీన తీర్పును రిజర్వ్ చేసిన మేజిస్ట్రేట్ నేడు పిటిషన్‌ను డిస్మిస్ చేస్తూ తీర్చు ఇచ్చారు. ఇక బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్ చేశారు.

ఇదిలా ఉంటే, అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో పోసానికి బెయిల్ మంజూరు చేస్తూ కడప మొబైల్ కోర్టు గత శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చింది. పోసానికి బెయిలు ఇవ్వకూడదని పోలీసుల తరపు న్యాయవాదులు వాదనలు వినిపించినప్పటికీ.. కోర్టు పోసాని తరఫు న్యాయవాదుల వాదనలతో ఏకీభవిస్తూ బెయిల్ మంజూరు చేసింది. పోసాని కస్టడీ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. ఈ కేసులోనే పోసాని ఫిబ్రవరి 26వ తేదీన అరెస్టయ్యారు.

వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్‌ పై విచారణ 12కి వాయిదా

పోసానిని హైదరాబాద్‌లోని నివాసంలో అరెస్ట్‌ చేసి ఆ మరుసటి రోజు ఓబులవారిపల్లెకు తీసుకెళ్లారు. అటుపై పల్నాడు జిల్లా నరసరావుపేటలో, కర్నూల్‌ జిల్లా ఆదోనీ పీఎస్‌లలో నమోదైన కేసుల్లో పీటీ వారెంట్‌ కింద ఆయన్ని తరలించారు. ఈ కేసుల్లో ఉపశమనం కోరుతూ ఆయన వేశారు. మరోవైపు హైకోర్టులోనూ ఆయన వేసిన క్వాష్‌ పిటిషన్‌ విచారణ దశలో ఉంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement