MLA Koneti Adimulam Case Update: సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం కేసులో కీలక మలుపు, గుండె నోప్పిగా ఉందని వైద్య పరీక్షలకు సమయం కోరిన బాధితురాలు
తనపై ఎమ్మెల్యే అత్యాచారం చేశారంటూ కేసు పెట్టారు వరలక్ష్మి… ఇక, కేసు విచారణలో భాగంగా వరలక్ష్మికి వైద్య పరీక్షలు నిర్వహించాలని పోలీసులు భావించారు..
సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంపై నమోదైన అత్యాచార కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. తనపై ఎమ్మెల్యే అత్యాచారం చేశారంటూ కేసు పెట్టారు వరలక్ష్మి… ఇక, కేసు విచారణలో భాగంగా వరలక్ష్మికి వైద్య పరీక్షలు నిర్వహించాలని పోలీసులు భావించారు.. అయితే, అనారోగ్యంతో పాటు.. గుండె నొప్పిగా ఉందని చెబుతున్న బాధితురాలు వరలక్ష్మి.. తనకు వైద్య పరీక్షలకు కొంత సమయం కావాలని ఈస్ట్ పోలీసులను కోరారు.అనారోగ్య సమస్యలు.. గుండె నొప్పితో బాధపడుతున్న నాకు.. వైద్య పరీక్షల కోసం కొంత సమయం ఇవ్వాలంటూ రాతపూర్వకంగా పోలీసులను కోరారు. దీంతో అమెకు వైద్య పరీక్షలను పూర్తిగా కోలుకున్నాక నిర్వహించడానికి పోలీసులు అంగీకరించారు. చెన్నై అపోలో ఆస్పత్రిలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, అనారోగ్యంతో చేరినట్లు సమాచారం
సత్యవేడు నియోజకవర్గంలోని కేవీబీ పురానికి చెందిన టీడీపీ మహిళా కార్యకర్తపై అత్యాచారం చేశారన్న ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో.. ఎమ్మెల్యే ఆదిమూలాన్ని పార్టీ నుంచి టీడీపీ సస్పెండ్ చేసిన సంగతి విదితమే. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే ఆదిమూలంపై పోలీసులు రేప్ కేసు నమోదు చేశారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)