Nagari MLA Roja: కబడ్డీ ఆడిన ఎమ్మెల్యే రోజా దంపతులు, వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్, రోజా ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది వివిధ క్రీడా పోటీలు
నిత్యం రాజకీయాలతో బిజీగా ఉండే నగరి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆర్‌కే రోజా కాసేపు కబడ్డీ ఆడి ఆలరించారు. నవంబర్ 17న రోజా పుట్టినరోజును పురస్కరించుకుని ‘రోజా ఛారిటబుల్ ట్రస్ట్’ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది వివిధ క్రీడా పోటీలు నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే.
నిత్యం రాజకీయాలతో బిజీగా ఉండే నగరి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆర్‌కే రోజా కాసేపు కబడ్డీ ఆడి ఆలరించారు. నవంబర్ 17న రోజా పుట్టినరోజును పురస్కరించుకుని ‘రోజా ఛారిటబుల్ ట్రస్ట్’ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది వివిధ క్రీడా పోటీలు నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా నగరి డిగ్రీ కళాశాలోని క్రీడా మైదానంలో ‘స్పోర్ట్స్ మీట్’ నిర్వహిస్తున్నారు. నవంబర్ 1 నుంచి 16 వరకు కొనసాగే ఈ క్రీడా పోటీలను సోమవారం రోజా దంపతులు ప్రారంభించారు.
ఈ సందర్భంగా టాస్ వేసి కూతకు జట్టును ఎంపిక చేశారు. అనంతరం భార్యాభర్తలిద్దరూ సరదాగా కాసేపు కబడ్డీ ఆడారు. సెల్వమణి, రోజా రెండు జట్లుగా విడిపోయి ఆటగాళ్లతో కలిసి హుషారుగా కబడ్డీ ఆడారు. కోర్టులోకి దిగి కూత పెట్టడానికి వెళ్లిన రోజాను ఔట్ చేయడానికి భర్త సెల్వమణి ప్రయత్నించగా విఫలమయ్యారు. అనంతరం సెల్వమణి కూడా కూతకు వెళ్లినా ఆయనను రోజాతో పాటు ఇతర క్రీడాకారులు ఔట్ చేయలేకపోయారు. సరదాగా రోజా కబడ్డీ ఆడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
Here's Video Upate
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)