Nara Lokesh : ఏపీ ప్రభుత్వ పథకాల పేరు మార్పు, తల్లికి వందనం, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాలుగా మార్పు, మరిన్ని పథకాలకు కూడా
రాష్ట్రంలో విద్యాలయాలను రాజకీయాలకు అతీతంగా సరస్వతీ నిలయాలుగా తీర్చిదిద్దాలన్నది మా సంకల్పం అని చెప్పారు.
Vij, July 28: అయిదేళ్లపాటు గత ప్రభుత్వం భ్రష్టుపట్టించిన విద్యావ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయాలని సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు మంత్రి నారా లోకేష్. రాష్ట్రంలో విద్యాలయాలను రాజకీయాలకు అతీతంగా సరస్వతీ నిలయాలుగా తీర్చిదిద్దాలన్నది మా సంకల్పం అని చెప్పారు.
ఇందులో భాగంగా తొలుత గత ప్రభుత్వం నాటి ముఖ్యమంత్రి పేరుతో ఏర్పాటుచేసిన పథకాల పేర్లకు స్వస్తి చెబుతున్నాం అని... విద్యారంగంలో విశేష సేవలందించిన భరతమాత ముద్దుబిడ్డల పేర్లను ఆయా పథకాలకు నామకరణం చేసి సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించామన్నారు. ఇవాళ దివంగత మాజీ రాష్ట్రపతి అబ్ధుల్ కలామ్ వర్థంతి సందర్భంగా ఆ మహనీయుని స్పూర్తితో నూతన పథకాల పేర్లను ప్రకటించారు. డిప్యూటీ సీఎం పవన్ ప్రస్తావించినట్లుగానే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం పేరును ప్రకటించారు లోకేష్. Andhra Pradesh: ఏపీ మంత్రి నారా లోకేష్ మంచి మనసు,సౌదిలో చిక్కుకున్న మరో వ్యక్తిని స్వగ్రామానికి తీసుకొచ్చిన లోకేష్, గ్రామస్తుల హర్షం
Here's Tweet:
అయిదేళ్లపాటు గత ప్రభుత్వం భ్రష్టుపట్టించిన విద్యావ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయాలని చంద్రబాబునాయుడు గారి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో విద్యాలయాలను రాజకీయాలకు అతీతంగా సరస్వతీ నిలయాలుగా తీర్చిదిద్దాలన్నది మా సంకల్పం. ఇందులో భాగంగా తొలుత గత ప్రభుత్వం నాటి… pic.twitter.com/r9O8C0EuW1
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)