Pawan Kalyan: వీడియో ఇదిగో, ఓ అభిమాని తన బిడ్డను చేతుల్లోకి తీసుకోమని ఇస్తుంటే అతడిని నెట్టేసిన పవన్ కళ్యాణ్
జనసేనాధి నేత పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఎయిర్ పోర్టు లోపల నుంచి వస్తున్న పవన్ కళ్యాణ్ అభిమానులకు నమస్కరిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇంతలో ఓ అభిమాని తన బిడ్డను పవన్ కళ్యాణ్ దగ్గరకు తీసుకువచ్చాడు.
జనసేనాధి నేత పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఎయిర్ పోర్టు లోపల నుంచి వస్తున్న పవన్ కళ్యాణ్ అభిమానులకు నమస్కరిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇంతలో ఓ అభిమాని తన బిడ్డను పవన్ కళ్యాణ్ దగ్గరకు తీసుకువచ్చాడు. అయితే పవన్ అతన్ని పట్టించుకోకుండా ముందుకు వెళుతున్న సమయంలో అభిమాని మళ్లీ బిడ్డను పవన్ చేతిలో బలవంతంగా పెట్టేందుకు ప్రయత్నించాడు. అయితే పవన్ మాత్రం అభిమానిని విసుక్కుంటూ కారులో వెళ్లిపోయాడు. దీనిపై నెటిజన్లు ఆ తండ్రికి బుద్ది లేదు, పిల్లాడికి ఏదైనా అయితే ఏమి చేయాలని మండిపడుతున్నారు. కనీసం ఒక్క క్షణం ఆగి పవన్ కళ్యాణ్ ఆ పిల్లాడిని ఎత్తుకుంటే పోయేదిగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)