PM Modi Road Show in Visakhapatnam: ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ రోడ్ షో వీడియో ఇదిగో, పూల వర్షం కురిపించిన ప్రజలు

ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ చేరుకున్నారు. ఈ రోజు భారీ రోడ్ షోలో పాల్గొన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లతో కలిసి మోదీ రోడ్ షోలో పాల్గొన్నారు. మోదీ, చంద్రబాబు, పవన్ త్రయం ఎక్కిన ప్రత్యేక వాహనం నిదానంగా ముందుకు సాగుతుండగా... ప్రజలు పూలవర్షం కురిపించారు

PM Modi Road Show in Visakhapatnam (Photo-Video Grab)

ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ చేరుకున్నారు. ఈ రోజు భారీ రోడ్ షోలో పాల్గొన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లతో కలిసి మోదీ రోడ్ షోలో పాల్గొన్నారు. మోదీ, చంద్రబాబు, పవన్ త్రయం ఎక్కిన ప్రత్యేక వాహనం నిదానంగా ముందుకు సాగుతుండగా... ప్రజలు పూలవర్షం కురిపించారు. సిరిపురం సెంటర్ నుంచి ఏయూ ఇంజినీరింగ్ కాలేజి వరకు రోడ్డుకు ఇరువైపులా జనం పోటెత్తారు.

వెంటనే ఆరోగ్యశ్రీని యథాతథంగా కొనసాగించండి, చంద్రబాబు ప్రభుత్వంపై మండిపడిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

ఎన్డీయే కూటమి గెలిచాక ప్రధాని మోదీ తొలిసారి ఏపీ వచ్చిన నేపథ్యంలో... ప్రధాని పర్యటనను ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. అడుగడుగునా విజయోత్సాహం ప్రతిబింబించేలా భారీ ఏర్పాట్లతో రోడ్ షో ఏర్పాటు చేసింది. మోదీ, చంద్రబాబు, పవన్ వాహనం నేరుగా ఏయూ ఇంజినీరింగ్ కాలేజి మైదానంలో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణంలోకి ప్రవేశించింది. సభకు విచ్చేసిన ప్రజలకు అభివాదం చేస్తూ ముగ్గురు నేతలు ముందుకు సాగారు. ఇక, ఈ సభ ద్వారా మోదీ ఏపీకి సంబంధించిన అనేక అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు.

 PM Modi Road Show in Visakhapatnam

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement