Tirumala: తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఆరో రోజు వేడుకలు...నేత్ర పర్వంగా ప్రణయ కలహోత్సవం, భారీగా హాజరైన భక్తులు
తిరుమల వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశికి సరిగ్గా ఆరో రోజు, అధ్యాయోత్సవాలలో 17 రోజు
తిరుమల వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశికి సరిగ్గా ఆరో రోజు, అధ్యాయోత్సవాలలో 17 రోజు ఆగమ శాస్త్రం అనుసారం ప్రణయ కలహోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ నేపథ్యంలో ఇవాళ శ్రీవారి ఆలయంలో ప్రణయ కలహోత్సవం నేత్రపర్వంగా సాగింది.
శ్రీ మలయప్పస్వామివారు పల్లకి ఎక్కి మహాప్రదక్షిణ మార్గంలో స్వామి పుష్కరిణి వద్దకు వచ్చారు. ఇంతలో అమ్మవార్లు చెరొక పల్లకిపై అప్రదక్షిణంగా స్వామివారికి ఎదురుగా వచ్చి నిలుచున్నారు. పురాణ పఠనం జరుగుతుండగా అమ్మవార్ల తరఫున జియ్యంగార్లు పూలచెండ్లను స్వామివారిపై మూడుసార్లు విసిరి వేశారు.
స్వామివారు బెదిరినట్లుగా నటించి తానేమి తప్పు చేయలేదని అమ్మవార్లను ప్రాధేయపడతారు. అనంతరం అమ్మవార్లు శాంతించి స్వామివారికి ఇరువైపులా చేరి కర్పూరహారతులు అందుకుని ఆలయానికి చేరుకున్నారు. ఆ తరువాత ఆస్థానం నిర్వహించారు. మకరజ్యోతి దర్శనం వీడియో ఇదిగో, పొన్నాంబలమేడు కొండల్లోని కందమల శిఖరంపై దర్శనమిచ్చిన మకరజ్యోతి, స్వామియే శరణం అయ్యప్ప నామస్మరణతో మోగిన శబరిమల
Pranaya Kalahotsavam held at ttd on sixth day of Vaikuntha Ekadashi
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)