Bandla Ganesh Tweet: పక్క పక్కనే కూర్చున్న విజయసాయి రెడ్డి, చంద్రబాబు, ఫొటోను తన ట్విట్టర్ లో షేర్ చేసిన నిర్మాత బండ్ల గణేశ్, తప్పుబడుతూ కామెంట్

నందమూరి తారకరత్న భౌతిక కాయానికి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి నివాళి అర్పించారు. కాగా ఈ ఇద్దరూ చాలా సేపు తారకరత్న నివాసంలో ఉన్నారు. ఒకే సోఫాలో కూర్చొని మాట్లాడుకున్నారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Bandla Ganesh (Credits: Twitter)

నందమూరి తారకరత్న భౌతిక కాయానికి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి నివాళి అర్పించారు. కాగా ఈ ఇద్దరూ చాలా సేపు తారకరత్న నివాసంలో ఉన్నారు. ఒకే సోఫాలో కూర్చొని మాట్లాడుకున్నారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాజకీయాలను పక్కనబెట్టి జరగాల్సిన విషయాలపై చంద్రబాబు, బాలకృష్ణతో విజయసాయి రెడ్డి మాట్లాడుతున్నారు. అయితే, ఈ ఫొటోను తన ట్విట్టర్ లో షేర్ చేసిన నిర్మాత బండ్ల గణేశ్.. రాజకీయంగా బద్ధశత్రువులైన బాబు, విజయసాయి ఒక్క చోట కూర్చోవడాన్ని తప్పు బట్టారు.

బతికితే సింహంలా బతకాలి, చనిపోతే సింహంలా పోవాలన్నారు. ‘నా ప్రాణం పోయినా నేను శత్రువు అనుకున్న వాడితో ఈ విధంగా కూర్చొని మాట్లాడను. అవసరం వస్తే అక్కడ నుంచి వెళ్లిపోతా.. అది నా నైజం. అత్యంత బాధాకరమైన విచిత్రం. జనంలో విశ్వాసం కోల్పోవడానికి ఇలాంటి సంఘటనలే ఉదాహరణ. బతికితే సింహంలా బతకాలి, చచ్చిపోతే సింహంలా చచ్చిపోవాలి’ అని ట్వీట్ చేశారు.

Here's Tweet

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement