Raidurgam SBI Manager Arrest: కోటి రూపాయల కస్టమర్ల సొమ్ము నొక్కేసిన రాయదుర్గం ఎస్‌బీఐ సీనియర్ మేనేజర్ అరెస్ట్, వీడియో ఇదిగో..
రాయదుర్గం స్టేట్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ సీనియర్ మేనేజర్ ఫణికుమార్ బ్యాంకు ఖాతాదారులకు చెందిన రూ.1,07,30,023 నగదును తన తల్లి, సొంత కుటుంబ సభ్యుల ఖాతాలోకి జమ చేయడంతో ఉన్నతాధికారులు అతనిని సస్పెండు చేశారు.
అనంతపురం జిల్లాలోని రాయదుర్గం ఎస్‌బీఐ మేనేజర్ ఫణి కుమార్.. కోటి ఆరు లక్షల రూపాయలను కుటుంబ సభ్యుల అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసినట్లు ఉన్నతాధికారులు విచారణలో బయటపడిన సంగతి విదితమే. రాయదుర్గం స్టేట్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ సీనియర్ మేనేజర్ ఫణికుమార్ బ్యాంకు ఖాతాదారులకు చెందిన రూ.1,07,30,023 నగదును తన తల్లి, సొంత కుటుంబ సభ్యుల ఖాతాలోకి జమ చేయడంతో ఉన్నతాధికారులు అతనిని సస్పెండు చేశారు.
అనంతరం రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫణికుమార్‌ను అరెస్టు చేయడానికి పోలీస్ శాఖ రెండు బృందాలను ఏర్పాటు చేయగా రెండు నెలలుగా వైజాగ్, విజయవాడ, హైదరాబాద్ నగరాల్లో ఉంటూ తప్పించుకొని తిరిగాడు. ఎట్టకేలకు రాయదుర్గం సీఐ ఆధ్వర్యంలో పోలీసులు వైజాగ్‌లో అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఖాతాదారుల సొమ్మును రికవరీ చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Here's Video