Rajinikanth in Tirumala: తిరుమలలో సూపర్‌స్టార్, తెల్లవారుజామునే శ్రీవారిని దర్శించుకున్న రజనీకాంత్, కడప దర్గాకు వెళ్లి ప్రత్యేక ప్రార్ధనలు చేయనున్న తలైవా

గురువారం ఉదయం వీఐపీ బ్రేక్‌ దర్శన సమయంలో శ్రీవారి సుప్రభాత సేవలో కుటుంబ సమేతంగా పాల్గొన్నారు.

Rajinikanth offered prayers at Sri Venkateswara temple Rajinikanth says miracle and wonder will happen in 2021,CM Palaniswami says actor might have meant AIADMK’s return to power (Photo-ANI)

Tirumala, DEC 15: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని (Sri Venkateswara Swamy) సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ (Rajinikanth) దర్శించుకున్నారు. గురువారం ఉదయం వీఐపీ బ్రేక్‌ దర్శన సమయంలో శ్రీవారి సుప్రభాత సేవలో కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. తన కుమార్తె ఐశ్వర్య కూడా రజనీకాంత్‌ తో స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి ప్రత్యేక పూజల అనంతరం.. రజనీకాంత్‌ దంపతులకు ఆలయ పండితులు వేదాశీర్వచనం అందించగా, అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కాగా, రజనీకాంత్‌ ఇవాళ కడప అమీన్‌పీర్‌ దర్గాను దర్శించుకోనున్నారు. ఆయనతోపాటు మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఏఆర్‌ రెహమాన్‌ కూడా దర్గాకు వెళ్లనున్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)