Skill Development Scam Case: జీవోల్లో 13 చోట్ల చంద్రబాబు స్వహస్తాలతో చేసిన సంతకాలు, కేబినెట్ అనుమతి లేకుండానే కార్పొరేషన్ ఏర్పాటు చేశారని తెలిపిన ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్టు చేసిన సీఐడీ అరెస్ట్ చేసిన సంగతి విదితమే. ఈ కేసుపై ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ తాజాగా మాట్లాడుతూ..కేబినెట్ అనుమతి లేకుండా స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారని తెలిపారు.
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్టు చేసిన సీఐడీ అరెస్ట్ చేసిన సంగతి విదితమే. ఈ కేసుపై ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ తాజాగా మాట్లాడుతూ..కేబినెట్ అనుమతి లేకుండా స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారని తెలిపారు. కార్పొరేషన్ ఏర్పాటులో విధి విధినాలు పాటించలేదని, ప్రైవేట్ వ్యక్తి గంటా సుబ్బారావుకు మూడు బాధ్యతలు అప్పగించారని సంజయ్ తెలిపారు.
నేరుగా ఈ డిపార్ట్‌మెంట్ చంద్రబాబుతో సంప్రదించేలా ప్లాన్ చేశారు. జీవోల్లో 13 చోట్ల చంద్రబాబు స్వహస్తాలతో చేసిన సంతకాలున్నాయి. బడ్జెట్ అనుమతి, కౌన్సిల్ సమావేశానికి కూడా బాబు సంతకం ఉంది. సిమెన్స్‌ను తెచ్చి స్కిల్ సెంటర్లు పెట్టాలన్నది ఎంవోయూలో లేదు. అగ్రిమెంట్ దురుద్దేశపూర్వకంగా చేసుకున్నారు’’ అని సీఐడీ చీఫ్ పేర్కొన్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)