Bhumana on Chandrababu Arrest: చంద్రబాబు జీవితమంతా రక్తసిక్తమే,వ్యవస్థలను మేనేజ్‌ చేయడంలో ఆయన దిట్టని మండిపడిన టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి

చట్టాలకు ఎవరూ అతీతులు కారు. చట్టానికి అందరూ లోబడి ప్రవర్తించాల్సిందే. చంద్రబాబు అరెస్ట్‌ను ప్రజలు పట్టించుకోవడం లేదు’’ అని భూమన పేర్కొన్నారు.

Bhumana Karunakar Reddy

Skill Development Scam Caseలో అరెస్ట్ అయిన చంద్రబాబు రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి విదితమే. చంద్రబాబు జీవితమంతా రక్తసిక్తమేనని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, వ్యవస్థలను మేనేజ్‌ చేయడంలో చంద్రబాబు దిట్ట అంటూ మండిపడ్డారు.జైల్లో బాబుకు భద్రత లేదని కుటుంబసభ్యులనడం హాస్యాస్పదం. చట్టాలకు ఎవరూ అతీతులు కారు. చట్టానికి అందరూ లోబడి ప్రవర్తించాల్సిందే. చంద్రబాబు అరెస్ట్‌ను ప్రజలు పట్టించుకోవడం లేదు’’ అని భూమన పేర్కొన్నారు.చంద్రబాబు పాలనలో అవినీతిపై మిగిలిన కేసులన్నీ వేగవంతం చేయాలి. రాజధాని ఇన్నర్ రోడ్డు ఎలైన్‌మెంట్ స్కాం, సాగునీటి ప్రాజెక్టులు స్కాం, ఈఎస్‌ఐ స్కాం అన్నింటిలో విచారణ వేగవంతం చేయాలి’’ అని భూమన డిమాండ్‌ చేశారు.

Bhumana Karunakar Reddy

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు