Chandrababu Arrest: భర్తను అరెస్ట్ చేస్తే భార్య బాధ పడటం సహజం, నాన్న చేతికి పెట్టుకున్న ఉంగరంలోని చిప్ లోకేష్ పెట్టుకుంటే మంచిదని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ ఎద్దేవా

బావ కళ్లల్లో ఆనందం కోసం ప్రభుత్వంపై బాలకృష్ణ బురద చల్లితే సహించేది లేదని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ మండిపడ్డారు.

AP Ex Minister Vellampalli Srinivas (Photo-Video Grab)

Skill Development Scam Caseలో అరెస్ట్ అయిన చంద్రబాబు రాజమండ్రి జైల్లో ఉన్న సంగతి విదితమే. బావ కళ్లల్లో ఆనందం కోసం ప్రభుత్వంపై బాలకృష్ణ బురద చల్లితే సహించేది లేదని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ మండిపడ్డారు. పశ్చిమ నియోజక వర్గంలో పలు డివిజన్లలో పర్యటించిన వెల్లంపల్లి.. మీడియాతో మాట్లాడుతూ, భర్తను అరెస్ట్ చేస్తే భార్య బాధ పడటం సహజమని, చంద్రబాబుకి కోర్టులో మౌలిక సదుపాయాలు కల్పన విషయంలో ప్రభుత్వ న్యాయవాదులు ఎక్కడా అడ్డు పడలేదన్నారు.

టీడీపీ బంద్‌కి పిలుపునిస్తే హెరిటేజ్ సంస్థ వ్యాపారాలు చేసుకోవడం సిగ్గు చేటు. చంద్రబాబు స్కిల్ పేరిట దోచుకున్న సొమ్మును కక్కిస్తాం. లోకేష్ మతి భ్రమించి మాట్లాడుతున్నాడు. వాళ్ల నాన్న చేతికి పెట్టుకున్న ఉంగరంలోని చిప్ ఇప్పుడు లోకేష్ పెట్టుకుంటే మంచిది’’ అంటూ వెల్లంపల్లి శ్రీనివాస్‌ ఎద్దేవా చేశారు.

AP Ex Minister Vellampalli Srinivas (Photo-Video Grab)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif