Ex-Minister’s Driver Suicide: మాజీ హోం మంత్రి సుచరిత ఎస్కార్ట్ డ్రైవర్ ఆత్మహత్య

ఏపీ మాజీ హోంమంత్రి సుచరిత నివాసం వద్ద ఆమె ఎస్కార్ట్ డ్రైవర్ చెన్నకేశవరావు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. ఈ విషాదకర ఘటన నిన్న రాత్రి 9 గంటలకు చోటు చేసుకుంది.

Credits: Twitter

Vijayawada, Jan 24: ఏపీ మాజీ హోంమంత్రి సుచరిత (Mekathoti Sucharitha) నివాసం వద్ద ఆమె ఎస్కార్ట్ డ్రైవర్ (Escort Driver) చెన్నకేశవరావు ఆత్మహత్య (Suicide) చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. ఈ విషాదకర ఘటన నిన్న రాత్రి 9 గంటలకు చోటు చేసుకుంది. గుంటూరు బ్రాడీపేట 4వ లైన్ లో సుచరిత ఇంటి సమీపంలో ఉన్న తన గదిలో ఆత్మహత్య చేసుకున్నారు. తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. సుచరిత నివాసానికి సమీపంలో ఓ హాస్టల్ లో ఆమె సెక్యూరిటీ సిబ్బంది, డ్రైవర్లు రూమ్ తీసుకుని ఉంటున్నారు. ఆయన ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులే బలవన్మరణానికి కారణం కావచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. చెన్నకేశవరావు మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

టాలీవుడ్‌లో మరో తీవ్ర విషాదం, సూసైడ్ చేసుకున్న యువ నటుడు సుధీర్ వర్మ, వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్నట్లుగా వార్తలు

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now