Chandrababu's Convoy Meets with Accident: చంద్రబాబుకు తప్పిన ఘోర ప్రమాదం, టీడీపీ అధినేత కారును ఢీకొట్టిన మరో కారు, వంగిపోయిన వాహనం బంపర్

బూరుగుపూడిలో చంద్రబాబు ప్రయాణిస్తున్న కారును మరో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చంద్రబాబు ప్రయాణిస్తున్న వాహనం బంపర్ వంగిపోయింది. చంద్రబాబుకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

Chandra Babu Naidu (Photo/Twitter/TDP)

టీడీపీ అధినేత చంద్రబాబు తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో అపశ్రుతి చోటుచేసుకుంది. బూరుగుపూడిలో చంద్రబాబు ప్రయాణిస్తున్న కారును మరో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చంద్రబాబు ప్రయాణిస్తున్న వాహనం బంపర్ వంగిపోయింది. చంద్రబాబుకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

'ఇదేం కర్మ మన రాష్రానికి' కార్యక్రమంలో భాగంగా ఈరోజు నుంచి మూడు రోజుల పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు స్థానికులు ఘన స్వాగతం పలికారు. లోకేశ్ పాదయాత్ర నేపథ్యంలో చంద్రబాబు కొన్ని రోజుల పాటు ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. ఇప్పుడు రెగ్యులర్ గా ప్రజల్లో ఉండేందుకు ఆయన సిద్ధమయ్యారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)