Andhra Pradesh: ఏపీ ప్రభుత్వంపై చంద్రబాబు విమర్శలు, ప్రజలు వరదల్లో ఏమైపోయినా తమకేంటి అనుకుంటున్నారా అంటూ ధ్వజం

గోదావరి ముంపు ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద వచ్చి పది రోజులు దాటినా ముంపు గ్రామాల్లో సహాయ చర్యలు సరిగ్గా చేపట్టలేదని విమర్శించారు.

Chandrababu Naidu (Photo-Twitter)

గోదావరి ముంపు ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద వచ్చి పది రోజులు దాటినా ముంపు గ్రామాల్లో సహాయ చర్యలు సరిగ్గా చేపట్టలేదని విమర్శించారు. గోదావరి ముంపు ప్రాంతమైన కూనవరం మండల కేంద్రంలో ఓ బాధితుడి ఇంట్లో చిన్నారులు బురదను తొలగించే ప్రయత్నం చేస్తున్న వీడియోను ట్విటర్లో షేర్ చేసిన చంద్రబాబు అన్ని చోట్లా ఇదే పరిస్థితి ఉందన్నారు. ప్రజలు వరదలో ఏమైపోయినా తమకేంటి అని అనుకుంటున్నారా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రజలను పలుకరిస్తే సరిపోదని, వాస్తవాలు తెలుసుకొని సాయం చేయాలని సూచించారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement