AP Girl Dead in USA: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెనాలి విద్యార్థిని మృతి
ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన గుంటూరు జిల్లా తెనాలి విద్యార్థిని రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు.
Vijayawada, July 21: అమెరికాలో (America) మరణిస్తున్న తెలుగు రాష్ట్రాల (Telugu States) విద్యార్థుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్నది. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన గుంటూరు జిల్లా తెనాలి విద్యార్థిని రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. మృతురాలిని తెనాలికి చెందిన జెట్టి హారిక (25) గా గుర్తించారు. మృతురాలు గతేడాది ఆగస్టులో అమెరికా వెళ్లారు. శనివారం యూనివర్సిటీ నుంచి కారులో ఇంటికి వెళ్తుండగా లోగాన్ కౌంటీలోని ఒక్లహోమా హైవేపై వరుసగా మూడు కార్లు ఢీకొనటంతో హారిక అక్కడికక్కడే మరణించారు. కాగా, అమెరికాలో ఎంఎస్ చేసేందుకు వెళ్లిన తెనాలికే తాడిబోయిన రవితేజ(28) మూడు రోజుల క్రితం స్విమింగ్ పూల్ లో మునిగి మరణించారు.
నేటి నుంచి ఏపీ శాసనసభ సమావేశాలు.. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్న గవర్నర్
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)