US: అమెరికాలో తెలుగు యువకుడిపై పట్టపగలే కాల్పులు, అక్కడికక్కడే మరణించిన విశాఖ వాసి, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఆస్పత్రికి తరలించిన పోలీసులు
అమెరికాలో దోపిడి దొంగలు పట్టపగలే లూటీలకు ప్రయత్నిస్తున్నారు. తుపాకులు చేతబట్టి కాల్పులకు తెగపడుతున్నాడు. కాగా అలబామలోని బిర్మింగ్‌హమ్‌లో ఫిబ్రవరి 11న జరిగిన కాల్పుల్లో తెలుగు యవకుడు ప్రాణాలు కోల్పోయాడు.
అమెరికాలో దోపిడి దొంగలు పట్టపగలే లూటీలకు ప్రయత్నిస్తున్నారు. తుపాకులు చేతబట్టి కాల్పులకు తెగపడుతున్నాడు. కాగా అలబామలోని బిర్మింగ్‌హమ్‌లో ఫిబ్రవరి 11న జరిగిన కాల్పుల్లో తెలుగు యవకుడు ప్రాణాలు కోల్పోయాడు. విశాఖపట్నం సిటీకి చెందిన సత్యకృష్ణ చిట్టూరి (27) గతేడాది వివాహం అయ్యింది. భార్య ప్రస్తుతం గర్భవతిగా ఉంది. అయితే అమెరికాలో ఉన్నత విద్య చదవాలనే లక్ష్యంతో గత నెల అమెరికా చేరుకున్నాడు.
అలబామ రాష్ట్రంలోని బిర్మింగ్‌హామ్‌ల్‌లో ఓ క్రౌన్ సర్వీస్ స్టేషన్ అనే స్టోర్‌లో క్లర్క్‌గా పార్ట్‌టైం జాబ్ చేస్తున్నాడు. ఫిబ్రవరి 11న సత్యకృష్ణ పని చేస్తున్న స్టోర్‌లో దోపిడికి దొంగలు యత్నించారు. ఆయుధాలు చేతబట్టి స్టోర్‌లోకి చొరబడ్డారు. దొంగలు కాల్పులు జరపడంతో సత్యకృష్ణ అక్కడిక్కడే మరణించాడు. సత్యకృష్ణ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పోలీసులు ఆస్పత్రికి తరలించారు. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా నిందితుడి ఫోటోలు రిలీజ్ చేశారు. కాల్పులు జరిపి సత్యకృష్ణ చావుకి కారణమైన దుండగుడి ఆచూకీ తెలిస్తే తెల్లడేగా కౌంటీ పోలీసులకు తెలపాలంటూ కోరారు.