కాకినాడ జిల్లా గండేపల్లికి చెందిన మహిళ కువైట్ వెళ్లి అక్కడ పడుతున్న చిత్రహింసలపై రహస్యంగా వీడియో తీసి తన బంధువులకు పంపింది. ఈ ఘటం నియోజకవర్గంలో కలకలం రేపుతుంది..నాకు సరిగా తిండిపెట్టడంలేదు, చంపేసేలా ఉన్నారు.నన్న కాపాడి, పిల్లల వద్దకు చేర్చాలంటూ' కన్నీటి పర్యంతమవుతోంది.

గండేపల్లి మండలం యల్లమిల్లి గ్రామానికి చెందిన గారా కుమారికి జగ్గంపేట మండలం రామవరం గ్రామానికి చెందిన వెంకటే బాధితురాలు కుమారి శ్తో 19 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు, ఒక కుమారుడు ఉన్నారు. భర్త వెంకటేశ్ ఐదేళ్ల క్రితం మృతి చెందడంతో పిల్లలతో సహా యల్ల మిల్లిలో ఉంటోంది.

భర్త మృతితో పిల్లల పోషణ, కుటుంబ భారం తనపై పడడంతో బతుకుతెరువు కోసం పలుచోట్ల పనిచేసింది. అయినా సంపాదన చాలకపోవడంతో కువైట్ వెళ్లాలని నిర్ణయించుకుంది.

అమ్మాయికి మెసేజ్ చేశాడని యువకుడిని చితకబాదిన ముగ్గురు యువకులు, తూర్పు గోదావరి జిల్లాలో ఘటన..వీడియో ఇదిగో

పిల్లలను తన తల్లికి అప్పగించి తనకు తెలిసిన వ్యక్తి ద్వారా పాలకొల్లుకు చెందిన ఎం.సుధాకర్ అనే ఏజెంట్ సహాయంతో కువైట్లోని జబ్రాలి హమ్మద్ నగరంలో ఒక ఇం ట్లో పనికి వెళ్లింది. కువైట్ వెళ్లిన ఏడు నెలల కాలంలోనే తాను పలు సమ స్యలు ఎదుర్కొంటూ, చిత్రహింసలకు గురవుతున్నట్టు వీడియో ద్వారా బాధితురాలు వాపోతోంది.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)