pic : X

రత్న శాస్త్రాన్ని గురించి మనం తెలుసుకున్నట్లయితే తొమ్మిది రత్నాలు కూడా వాటి వాటి ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. అయితే ఏ రాశి వారు ఏ రత్నాన్ని ధరించాలి. ధరించడానికి కావలసిన నియమాలు ఏ వేలు పైన ధరించాలి. అనే విషయాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం.

బుధుడు జన్మస్థలంలో పుట్టిన వారికి ఈ రత్నం శుభాలను అందిస్తుంది.

రత్నశాస్త్రం ప్రకారం ఆకుపచ్చ రత్నం అనేకం అద్భుతమైన ప్రయోజనాలను కలిగి ఉంది ఇది బుధ గ్రహానికి సంబంధించిందిగా చెప్పవచ్చు. జాతకంలో బుధుడి బలహీనగ్రహం ఉన్నవారు ఈ రత్నాన్ని ధరించడం చాలా మంచిది. ఈ రత్నాన్ని ధరించడం వల్ల ఉద్యోగం వ్యాపారంలో అభివృద్ధి అవకాశాలు పెరుగుతాయి. అంతేకాకుండా ఆర్థిక సమస్యల నుంచి కూడా బయటపడతారు. ఆరోగ్యపరంగా కూడా ఎటువంటి సమస్యలు ఉండవు. కుటుంబం గొడవలు రాకుండా ఉంటాయి.

ఆకుపచ్చ రత్నాన్ని ఏ రాశి వారు ధరించాలి

ఈ ఐదు రాశులు వారు ధరించడం వల్ల అనేక ఫలితాలు ఉంటాయి. ఆకుపచ్చ రత్నాన్ని ధరించడం ద్వారా వారి వారి జీవితాల్లో అనేక మార్పులు వస్తాయి. ముఖ్యంగా అన్ని శుభ ఫలితాలు ఉంటాయి. ఆ ఐదు రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మిథునం, కన్య, మకరం, కుంభ, కర్కాటక.ఈ రాశుల వారు ఆకుపచ్చ రత్నాన్ని ధరించడం వల్ల అనేక శుభ ఫలితాలు పొందుతారు. మీ జాతకంలో బలహీనంగా ఉన్నట్లయితే ఈ ఆకుపచ్చ రత్నాన్ని ధరించవచ్చు.

Vastu Tips: వాస్తు రీత్యా కిచెన్ ఏ దిక్కులో ఉండాలో తెలుసా,

ఆకుపచ్చ రత్నం ధరించడానికి నియమాలు.

-ఆకుపచ్చ రత్నాన్ని చిటికెన వేలుకు మాత్రమే ధరించాలి.

-ఆకుపచ్చ రత్న ఉన్న ఉంగరాన్ని బంగారంతో లేదా వెండితో చేసిన ఉంగరంలో అమర్చిన తర్వాత మాత్రమే ధరించాలి.

-ఆకుపచ్చ రత్నాన్ని కొనుగోలు చేసేటప్పుడు అది నాణ్యమైనదా అని కనుక్కోవాలి.

-ఈ ఆకుపచ్చ రత్నాన్ని వేలుకు ధరించే ముందు ఓం బుధాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి.

-ఈ ఆకుపచ్చ రత్నాన్ని ధరించే ముందు తేనే పాలు గంగాజలం తో రాత్రంతా ఉంచి ఉదయాన్నే దీన్ని ధరించడం మంచిది.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.