స్కోడా Kylaq కాంపాక్ట్ ఎస్‌యూవీని ఈ రోజు భారత్‌లో విడుదల చేసింది, దీని ప్రారంభ ధర రూ.7.89 లక్షలుగా నిర్ణయించింది. బుకింగ్‌లు డిసెంబర్ 2 నుంచి ప్రారంభం కానుండగా.. డెలివరీలు 2024, జనవరి 27 నుంచి మొదలవుతాయి. కైలాక్.. హ్యుందాయ్ వెన్యూ, టాటా నెక్సాన్, మారుతీ బ్రెజా, మహీంద్రా 3XO వంటి కార్లతో పోటి పడనుంది.
కైలాక్ లోపలి భాగంలో యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటోకు సపోర్ట్‌గా 10 అంగుళాల టచ్‌స్క్రీన్ అమర్చి ఉన్నాయి. ఈ ఎస్‌యూవీలో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వెనుక ఏసీ వెంట్‌లు, సింగిల్ పేన్ సన్‌రూఫ్ కూడా ఉన్నాయి. ఇతర సౌకర్యవంతమైన ఫీచర్లలో..కీలెస్ ఎంట్రీ, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఉన్నాయి. భద్రతాపరంగా కైలాక్ అన్ని వేరియంట్లలో సమగ్రమైన ఫీచర్లతో వస్తుంది.
జీప్ ఇండియా నుంచి జీప్ మెరిడియన్ ఎస్‌యూవీ కారు, ధర రూ.24.99 లక్షల నుంచి రూ.36.99 లక్షల వరకు..
వీటిలో ఆరు ఎయిర్ బ్యాగ్‌లు, ఈబీడీతో కూడిన ఏబీఎస్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, ప్రయాణీకులందరికీ 3-పాయింట్ సీట్ బెల్ట్‌లు ఉన్నాయి. కైలాక్ 1.0-లీటర్, 3-సిలిండర్ టర్బోఛార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. స్కోడాకు భారత్ కీలకమైన మార్కెట్. భారత్‌లో 2026 నాటికి ఏడాదికి ఒక లక్ష కార్లను విక్రయించాలని స్కోడా లక్ష్యంగా పెట్టుకుంది.