Rush in Tirumala: దీపావళి రోజు శ్రీవారిని దర్శించకున్న 75 వేల మంది భక్తులు.. ఒక్కరోజులో హుండీ ఆదాయం రూ.3.58 కోట్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పట్టిందంటే??
దీపావళి పండుగ సందర్భంగా కలియుగ ప్రత్యేక్ష దైవం తిరుమల తిరుపతి వెంకటేశున్ని భక్తులు భారీ సంఖ్యలో దర్శించుకున్నారు. పండుగ నాడు మొత్తం 74,807 మంది భక్తులు శ్రీ అలిమేలు మంగ, పద్మావతి సమేత వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారని ఆలయ అధికారులు తెలిపారు.
Tirumala, Nov 13: దీపావళి (Diwali) పండుగ సందర్భంగా కలియుగ ప్రత్యేక్ష దైవం తిరుమల (Tirumala) తిరుపతి (Tirupathi) వెంకటేశున్ని భక్తులు భారీ సంఖ్యలో దర్శించుకున్నారు. పండుగ నాడు మొత్తం 74,807 మంది భక్తులు శ్రీ అలిమేలు మంగ, పద్మావతి సమేత వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారని ఆలయ అధికారులు తెలిపారు. అదేవిధంగా మొత్తం 21,974 మంది తలనీలాలు సమర్పించుకున్నారని వెల్లడించారు. భక్తుల రద్దీ కారణంగా టోకెన్ లు లేని భక్తులకు సర్వదర్శనానికి 6 గంటల సమయం పట్టిందని అధికారులు చెప్పారు. పండుగ సందర్భంగా భక్తులు భారీగా రావడంతో శ్రీవారికి హుండీ ఆదాయం కూడా భారీగా వచ్చింది. భక్తులు ఒక్కరోజే శ్రీవారి హుండీలో రూ.3.58 కోట్లు వేశారు. కాగా, దీపావళి పండుగ సందర్భంగా ఆలయాన్ని అంగరంగ వైభవంగా ముస్తాబు చేశారు.
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)