Tirupati Stampede: వీడియో ఇదిగో, చంద్రబాబు ఎక్కడ ఉంటే అక్కడ మరణాలు తప్పవు, వెంటనే రాజీనామా చేయాలని కేఏ పాల్‌ డిమాండ్

చంద్రబాబు నాయుడు నిర్లక్ష్యం వల్లే ఇప్పుడు తిరుపతి(Tirupati)లో ఆరుగురు చనిపోయారు. చంద్రబాబు ఎక్కడ ఉంటే అక్కడ మరణాలు తప్పవు. అందుకే చంద్రబాబు సీఎం పదవికి రాజీనామా చేయాలి అని పాల్‌ డిమాండ్‌ చేశారు.

KA Paul and Chandrababu (Photo-X)

తిరుపతి తొక్కిసలాట ఘటనకు అధికార యంత్రాంగాన్ని సీఎం చంద్రబాబు  బాధ్యుల్ని చేయడంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌(KA Paul) మండిపడ్డారు .చంద్రబాబు తాను ఏపీకి సీఎం అనే విషయాన్ని మరిచిపోయి అలా ప్రవర్తించి ఉంటారేమో అని ఎద్దేవా చేశారు. ఇది నిర్లక్ష్యం వల్ల జరిగిన ఘటన. కాబట్టి చంద్రబాబే బాధ్యత వహించి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలన్నారు. ఘటనకు బాధ్యులను చేస్తూ ఆయన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ, తానే సీఎం అనే విషయాన్ని ఆయన మరిచిపోతున్నారన్నారు.

వీడియో ఇదిగో, తిరుపతి తొక్కిసలాట ఘటనపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు క్షమాపణ చెప్పి తీరాలి, పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు

చంద్రబాబు(Chandrababu) సీఎంగా ఉన్నప్పుడు.. 2019లో పుష్కరాల సమయంలో 20 మందికి పైగా చనిపోయారు.. మరెందరో గాయపడ్డారు. కందుకూర్లో పొలిటికల్ ర్యాలీ నిర్వహిస్తే అక్కడా చనిపోయారు. గుంటూరులో ర్యాలీ నిర్వహిస్తే ముగ్గురు చనిపోయారు. తారకరత్న కూడా చంద్రబాబు ర్యాలీలో చనిపోయారు. చంద్రబాబు నాయుడు నిర్లక్ష్యం వల్లే ఇప్పుడు తిరుపతి(Tirupati)లో ఆరుగురు చనిపోయారు. చంద్రబాబు ఎక్కడ ఉంటే అక్కడ మరణాలు తప్పవు. అందుకే చంద్రబాబు సీఎం పదవికి రాజీనామా చేయాలి అని పాల్‌ డిమాండ్‌ చేశారు.

KA Paul Slams CM Chandrababu Naidu

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement