Tirupati Laddu Row: మా నెయ్యిలో ఎలాంటి కల్తీ లేదు, తిరుమల లడ్డూ వ్యవహారంపై ఏఆర్ డెయిరీ వివరణ
తమిళనాడుకు చెందిన ఏఆర్ డెయిరీ ఈ కల్తీ నెయ్యి సరఫరా చేసినట్టు ఆరోపణలు వచ్చాయి.
తిరుమల పుణ్యక్షేత్రంలో పవిత్ర ప్రసాదం లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలిపి కల్తీ నెయ్యి వాడారంటూ సీఎం చంద్రబాబు స్వయంగా ఆరోపించడం తెలిసిందే. తమిళనాడుకు చెందిన ఏఆర్ డెయిరీ ఈ కల్తీ నెయ్యి సరఫరా చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఏఆర్ డెయిరీ స్పందించింది. నాణ్యతా పరీక్షల తర్వాతే టీటీడీకి నెయ్యి సరఫరా చేశామని స్పష్టం చేసింది. జూన్, జులై నెలలోనే నెయ్యి సరఫరా చేశామని, ల్యాబ్ పరీక్షలు సంతృప్తికరంగా అనిపించిన తర్వాతే నెయ్యిని సరఫరా చేసినట్టు ఏఆర్ డెయిరీ వివరించింది. తాము ఇప్పటివరకు సరఫరా చేసిన నెయ్యిలో ఎలాంటి నాణ్యతా లోపం లేదని పేర్కొంది.తమపై విషప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. టీటీడీ అడిగిన వెంటనే సంబంధిత రిపోర్టును పంపించామని తెలిపింది. కానీ టీటీడీ నుంచి తమకు స్పందన రాలేదని తెలిపింది.
Here's News
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)