Sanatana Dharma Remark Row: సనాతన ధర్మం మతం కాదు అదొక జీవనయానం, ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలను ఖండిస్తున్నామని తెలిపిన టీటీడీ చైర్మన్
సనాతన ధర్మం మతం కాదని, అదొక జీవన యానం అని చెప్పారు. ఈ విషయం తెలియక సనాతన ధర్మానికి, కులాలను ఆపాదించి విమర్శలు చేయడం వల్ల సమాజంలో అలజడి చెలరేగే అవకాశం ఉంటుందన్నారు
సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఖండించారు. సనాతన ధర్మం మతం కాదని, అదొక జీవన యానం అని చెప్పారు. ఈ విషయం తెలియక సనాతన ధర్మానికి, కులాలను ఆపాదించి విమర్శలు చేయడం వల్ల సమాజంలో అలజడి చెలరేగే అవకాశం ఉంటుందన్నారు... ఇది విమర్శకులకు కూడా మంచిది కాదని హెచ్చరించారు.సనాతన ధర్మ వ్యాప్తి జరగాలని, యువతలో భక్తి పెంచడానికి అనేక నిర్ణయాలు తీసుకున్నామని టీటీడీ ఛైర్మన్ వెల్లడించారు. గోవింద కోటి రాయించాలని నిర్ణయించామని, చిన్నపిల్లల నుండి 25 సంవత్సరాల లోపు పిల్లలు గోవిందా కోటిని రాస్తారో వారి కుటుంబానికి విఐపీ దర్శనం కల్పిస్తామన్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)