Amit Shah In AP: ఏపీలో పేదలకు పంచుతున్న బియ్యం మోడీ ఇచ్చినవే, కేంద్రం ఇస్తున్న బియ్యంపై జగన్ ఫొటో వేసుకుంటున్నారు..ఏపీ పర్యటనలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా కామెంట్స్
ఈ సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఏపీలో పేదలకు పంచుతున్న బియ్యం మోడీ ఇచ్చినవే.. కేంద్రం ఇస్తున్న బియ్యం తామే ఇస్తున్నట్లు జగన్ ఫొటో వేసుకుంటున్నారని విమర్శించారు.
ప్రధాని మోదీ 9 ఏళ్ల పాలన విజయోత్సవాల్లో భాగంగా విశాఖ పట్నంలోని రైల్వేగ్రౌండ్‌లో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఏపీలో పేదలకు పంచుతున్న బియ్యం మోడీ ఇచ్చినవే.. కేంద్రం ఇస్తున్న బియ్యం తామే ఇస్తున్నట్లు జగన్ ఫొటో వేసుకుంటున్నారని విమర్శించారు. ప్రపంచ దేశాలు మోడీ జపం చేస్తున్నాయి. నరేంద్ర మోడీ బీజేపీకి చెందిన వ్యక్తి కాదు, 131 కోట్ల మందికి దక్కుతున్న గౌరవం అని అమిత్‌షా అన్నారు. జగన్ నాలుగేళ్ల పాలనలో అవినీతి ఆరోపణలు, కుంభకోణాలు తప్ప మరేమీ లేదన్నారు. మన్మోహన్ హయాంలో అవినీతి జరిగినా చర్య తీసుకునే సత్తా లేకపోయిందని, పుల్వామా ఘటన జరిగిన 10 రోజుల్లోనే ప్రతీకారం తీసుకున్నాం, సర్జికల్ స్ట్రైక్‌తో పాక్‌కు బుద్ధిచెప్పామని అమిత్‌షా పేర్కొన్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)