Chandrababu on Study: వీడియో ఇదిగో, ఇంటర్మీడియట్‌లో ఇంజనీరింగ్ చేయాలంటే బైపీసీ చేయాలని తెలిపిన చంద్రబాబు, వైరల్ అవుతున్న క్లిప్

ఇంటర్మీడియట్‌లో ఇంజినీరింగ్ చేయాలంటే బైపీసీ చేయాలి.. అంటూ ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతూ ఉన్నాయి. ఆగస్టు 15 సందర్భంగా విశాఖపట్నంలో "ఇండియా విజన్ 2047" డాక్యుమెంట్ విడుదల కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Andhra Pradesh's Ex-Chief Minister N. Chandrababu Naidu. (Photo Credits: IANS)

ఇంటర్మీడియట్‌లో ఇంజినీరింగ్ చేయాలంటే బైపీసీ చేయాలి.. అంటూ ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతూ ఉన్నాయి. ఆగస్టు 15 సందర్భంగా విశాఖపట్నంలో "ఇండియా విజన్ 2047" డాక్యుమెంట్ విడుదల కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ ఇండియా విజన్ 2047 ప్రోగ్రాంలో చంద్రబాబు నాయుడు మరికొన్ని విషయాలను ప్రస్తావించారు.

తన విజన్‌ గురించి వివరించే సమయంలో.. పిల్లలు ఇంజినీరింగ్ చేయాలనుకోవటం తల్లిదండ్రుల 20 ఏళ్ల కల.. ఆ కలే విజన్ అంటూ చంద్రబాబు వివరించారు. ఆ విజన్ నెరవేర్చుకునేందుకు పిల్లలను చిన్నప్పటి నుంచే ఏ స్కూల్‌లో వేయాలి.. ఇంటర్మీడియట్ ఎక్కడ చేయాలి.. ఇంటర్మీయట్‌లో ఇంజినీరింగ్ చేయాలంటే బైపీసీ చేయాలి.. అని వివరిస్తూ చెప్పుకొచ్చారు. ఆయన చెప్పిన చాలా విషయాలను ప్రస్తుతం పట్టించుకోకుండా.. బైపీసీ.. ఇంజినీరింగ్.. అంటూ చెప్పిన వ్యాఖ్యలను వైరల్ చేయడం మొదలుపెట్టారు.

Andhra Pradesh's Ex-Chief Minister N. Chandrababu Naidu. (Photo Credits: IANS)

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement