Meda Raghunadha Reddy on Party Change Rumors: రాజకీయాల్లో ఉన్నంత వరకు జగన్‌తోనే నా ప్రయాణం, పార్టీ మారడంపై క్లారిటీ ఇచ్చిన వైసీపీ ఎంపీ మేడా రఘునాథ్ రెడ్డి
వైసీపీకి రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథ్ రెడ్డి రాజీనామా చేయనున్నట్లు గత కొన్ని రోజులుగా ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ మారడంపై క్లారిటీ ఇస్తూ.. తాను పార్టీ మారడం లేదని తేల్చి చెప్పారు. పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు.
ఏపీ రాజకీయాల్లో ఎన్నికల్లో ఓటమి చెందిన వైసీపీ నుంచి నేతలు ఒకరొకరుగా రాజినామా చేస్తున్నారు. వైసీపీకి రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథ్ రెడ్డి రాజీనామా చేయనున్నట్లు గత కొన్ని రోజులుగా ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ మారడంపై క్లారిటీ ఇస్తూ.. తాను పార్టీ మారడం లేదని తేల్చి చెప్పారు. పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. చివరి వరకు వైసీపీలోనే ఉండి బీసీల కోసం కొట్లాడతా, పార్టీ మార్పు రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చిన వైసీపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య
కొందరు కావాలనే తనను రాజకీయం ఇబ్బంది పెట్టాలని ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయాల్లో ఉన్నంత వరకు జగన్ తోనే ప్రయాణం అని అన్నారు. తాను పార్టీ మారుతున్నానని కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఫైర్ అయ్యారు. ఇదంతా తప్పుడు ప్రచారం.. కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. నేను వైఎస్సార్‌సీపీని వీడేది లేదు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలోనే పని చేస్తానని చెప్పారు.
Here's News
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)