Jagan Meets Palavalasa Family: పాలవలస రాజశేఖరం కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ జగన్, పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని హామీ
వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండకు చేరుకున్నారు. నియోజకవర్గంలో సీనియర్ నేత అయిన పాలవలస రాజశేఖరం(81) ఇటీవల అనారోగ్యంతో కన్నమూసిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబాన్ని జగన్ పరామర్శించారు.
వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండకు చేరుకున్నారు. నియోజకవర్గంలో సీనియర్ నేత అయిన పాలవలస రాజశేఖరం(81) ఇటీవల అనారోగ్యంతో కన్నమూసిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబాన్ని జగన్ పరామర్శించారు. అంతకు ముందు రాజశేఖరం మృతిపై సంతాపం వ్యక్తం చేసిన వైఎస్ జగన్.. ఫోన్ ద్వారా ఆ కుటుంబంతో మాట్లాడి సంఘీభావం తెలిపారు. ఇప్పుడు నేరుగా ఆ కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు.పాలసవలస రాజశేఖరం.. ఎమ్మెల్యేగా, రాజ్యసభ సభ్యుడిగా పని చేశారు.ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్.. రాజశేఖరం తనయుడే. మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఈయన కుమార్తె.
పాలవలస రాజశేఖరం కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ జగన్
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)