Gorantla Madhav on Chandrababu: వీడియో ఇదిగో, చంద్రబాబు 2024లో చస్తారంటూ వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వివాదాస్పద వ్యాఖ్యలు, టీడీపీ శ్రేణుల్లో కలకలం
2024లో చంద్రబాబు చస్తారని... జగన్ సీఎం అవుతారని చెప్పారు. చంద్రబాబు బస్సు యాత్ర చేసి ఇప్పుడు జైలు యాత్ర చేస్తున్నారని అన్నారు.
హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 2024లో చంద్రబాబు చస్తారని... జగన్ సీఎం అవుతారని చెప్పారు. చంద్రబాబు బస్సు యాత్ర చేసి ఇప్పుడు జైలు యాత్ర చేస్తున్నారని అన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్ర చేసి... ఇప్పుడు పారిపోయే యాత్ర చేస్తున్నారని ఎద్దేవా చేశారు. వైసీపీ చేపట్టిన సామాజిక సాధికార యాత్రలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు
ఇక నారా లోకేశ్ యువగళం యాత్ర చేసి... ఇప్పుడు ఢిల్లీ చుట్టూ తిరిగే యాత్ర చేస్తున్నారని అన్నారు. లోకేశ్ పాదయాత్రను పక్కన పెట్టి పారిపోయారని చెప్పారు. మరోవైపు చంద్రబాబును ఉద్దేశించి గోరంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యలు టీడీపీ శ్రేణుల్లో కలకలం రేపుతున్నాయి. జైల్లో చంద్రబాబుకు ఏదైనా అపకారం తలపెట్టే అవకాశం ఉందని ఇప్పటికే టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)