MP Sri Krishna Devarayalu Lavu: టీడీపీ ఎంపీ కేశినేని నాని ఇంట్లో వైసీపీ ఎంపీ, ఢిల్లీలో టీడీపీ ఎంపీలతో కలిసి ఫోటోకు ఫోజు ఇచ్చిన నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు
వైసీపీ యువ నేత, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మంగళవారం టీడీపీ ఎంపీలతో కలిసి దర్శనమిచ్చారు. టీడీపీతో పాటు మరికొన్ని పార్టీల ఎంపీలతో కలిసి ఆయన నేరుగా టీడీపీ సీనియర్ నేత, విజయవాడ ఎంపీ కేశినేని నానికి చెందిన ఢిల్లీ నివాసానికి వెళ్లారు.
వైసీపీ యువ నేత, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మంగళవారం టీడీపీ ఎంపీలతో కలిసి దర్శనమిచ్చారు. టీడీపీతో పాటు మరికొన్ని పార్టీల ఎంపీలతో కలిసి ఆయన నేరుగా టీడీపీ సీనియర్ నేత, విజయవాడ ఎంపీ కేశినేని నానికి చెందిన ఢిల్లీ నివాసానికి వెళ్లారు. అక్కడ టీడీపీకి చెందిన ముగ్గురు ఎంపీలు కేశినేని, గల్లా జయదేవ్, కింజరాపు రామ్ మోహన్ నాయుడులతో కలిసి గ్రూప్ ఫొటోకు ఫోజిచ్చారు.
ఈ ఫొటోలో టీడీపీకి చెందిన ముగ్గురు ఎంపీలు, వైసీపీ ఎంపీ లావులతో పాటు డీఎంకేకు చెందిన ఎంపీలు కనిమొళి, తమిజాచ్చి తంగపాండియన్, కథిర్ ఆనంద్, ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే, శివసేన ఎంపీ ధైర్యశీల్ మానే తదితరులు కూడా ఉన్నారు. తామంతా కలిసి కేశినేని నాని ఇంటికి వెళ్లినట్లు పేర్కొన్న డీఎంకే ఎంపీ కథిర్ ఆనంద్ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)