NTR Coin: నేటి నుంచి అందుబాటులోకి రూ.100 ఎన్టీఆర్ నాణెం.. ధర ఎంతో తెలుసా?
ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ముద్రించిన రూ.100 స్మారక నాణేన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం విడుదల చేశారు. రాష్ట్రపతి భవన్‌లోని సాంస్కృతిక కేంద్రంలో ఈ కార్యక్రమం జరిగింది.
Hyderabad, Aug 29: ఎన్టీఆర్ (NTR) శతజయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం (Central Government) ముద్రించిన రూ.100 స్మారక నాణేన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Draupadi Murmu) సోమవారం విడుదల చేశారు. రాష్ట్రపతి భవన్‌లోని సాంస్కృతిక కేంద్రంలో ఈ కార్యక్రమం జరిగింది. కాగా, ఈ స్మారక నాణేం హైదరాబాద్‌లోని మింట్‌లో తయారైంది. తొలి విడతగా 12 వేల స్మారక నాణేలు ముద్రించామని, వీటి ధర రూ.3,500 నుండి రూ.4,850 వరకు ఉందని హైదరాబాద్‌లోని మింట్ చీఫ్ మేనేజర్ వీఎన్ఆర్ నాయుడు తెలిపారు. ఆన్‌లైన్ ద్వారా, హైదరాబాద్‌లోని మూడు చోట్ల ఈ నాణేలు విక్రయిస్తున్నట్లు తెలిపారు. డిమాండ్ మరింత ఉంటే మరిన్ని తయారు చేస్తామన్నారు.ఇదిలా ఉండగా, ఈ కాయిన్‌ను నేటి ఉదయం 10 గంటల నుండి అందుబాటులో ఉంచుతారు. ఈ నాణేన్ని 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్, 5 శాతం జింక్‌తో తయారు చేశారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)