Telangana: వీడియో ఇదిగో, చైనా మాంజా మెడకు చుట్టుకుని ట్రాఫిక్ పోలీసుకు తీవ్ర గాయాలు, నారాయణగూడ ఫ్లై ఓవర్ నుంచి తిలక్ నగర్ వెళ్తుండగా ఘటన

చైనా మాంజా చాలా ప్రమాదకరంగా మారింది. ఈ మాంజా కారణంగా పలు చోట్ల మరణాలు సంభవించగా మరికొన్ని చోట్ల చాలామంది గాయాల పాలయ్యారు. తాజాగా నారాయణగూడ ఫ్లై ఓవర్ నుంచి తిలక్ నగర్ వెళ్తుండగా చైనా మాంజా మెడకు చుట్టుకుని ట్రాఫిక్ పోలీస్ గాయపడ్డారు.

Chinese manja slits throat of Telangana cop (Photo-Video Grab)

చైనా మాంజా చాలా ప్రమాదకరంగా మారింది. ఈ మాంజా కారణంగా పలు చోట్ల మరణాలు సంభవించగా మరికొన్ని చోట్ల చాలామంది గాయాల పాలయ్యారు. తాజాగా నారాయణగూడ ఫ్లై ఓవర్ నుంచి తిలక్ నగర్ వెళ్తుండగా చైనా మాంజా మెడకు చుట్టుకుని ట్రాఫిక్ పోలీస్ గాయపడ్డారు. బాధితుడిని లంగర్ హౌస్ పీఎస్ లో ట్రాఫిక్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న శివరాజ్ గా గుర్తించారు. ఇక సంగారెడ్డి జిల్లా కర్దనూరు రహదారిపై ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తికి చైనా మాంజా తగిలి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు బాధితుని వెంటనే ఆసుపత్రికి తరలించారు. పటాన్​చెరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

సంక్రాంతి పండగ వేళ విషాదం.. గాలిపటం ఎగరవేస్తూ బిల్డింగ్ పై నుండి పడి వ్యక్తి మృతి, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘటన

మరో ఘటనలో నిజామాబాద్ జిల్లా నవిపేట్ మండల కేంద్రంలో ఒక యువకుడికి చైనా మాంజా చుట్టుకోవడంతో తీవ్రగాయాలయ్యాయి. మండల కేంద్రానికి చెందిన అద్నాన్ ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా చైనా మాంజా చుట్టుకోవడంతో మెడకు, కాలుకు, చేతివేలికి గాయాలయ్యాయి. హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లడంతో డాక్టర్లు చికిత్స చేసి ఎలాంటి ప్రాణాపాయం లేదనడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.

చైనా మాంజా మెడకు చుట్టుకుని ట్రాఫిక్ పోలీసుకు తీవ్ర గాయాలు

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now