‘Pushpa 2’ Stampede Incident: అల్లు అర్జున్ విచారణ పూర్తి, దాదాపు మూడున్నర గంటల పాటు విచారించిన చిక్కడపల్లి పోలీసులు, 50 వరకు ప్రశ్నలు అడిగినట్లుగా వార్తలు
చిక్కడపల్లి పోలీసులు దాదాపు మూడున్నర గంటల పాటు ఆయనను విచారించారు. విచారణ తర్వాత చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి వెళ్లిపోయారు. అల్లు అర్జున్ ఎవరితోనూ మాట్లాడకుండా కారు ఎక్కి వెళ్లిపోయారు
సంధ్య థియేటర్ ఘటన కేసులో సినీ నటుడు అల్లు అర్జున్ విచారణ పూర్తయింది. చిక్కడపల్లి పోలీసులు దాదాపు మూడున్నర గంటల పాటు ఆయనను విచారించారు. విచారణ తర్వాత చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి వెళ్లిపోయారు. అల్లు అర్జున్ ఎవరితోనూ మాట్లాడకుండా కారు ఎక్కి వెళ్లిపోయారు. విచారణ ముగిశాక అల్లు అర్జున్ ను పోలీసులు కట్టుదిట్టమైన భద్రత మధ్య ఆయన ఇంటికి తీసుకువెళ్లారు.
విచారణ కోసం ఈరోజు ఉదయం పదకొండు గంటలకు అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. న్యాయవాది అశోక్ రెడ్డి సమక్షంలో పోలీసులు అతనిపై ప్రశ్నల వర్షం కురిపించారు. అల్లు అర్జున్ స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డ్ చేశారు. సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష్ యాదవ్ ఆధ్వర్యంలో అల్లు అర్జున్‌ను విచారించారు. ఏసీపీ రమేశ్, ఇన్‌స్పెక్టర్ రాజునాయక్, న్యాయవాదులు విచారణలో ఉన్నారు. అల్లు అర్జున్‌ను 50 వరకు ప్రశ్నలు అడిగినట్లుగా తెలుస్తోంది. పలు ప్రశ్నలకు ఆయన మౌనం వహించారు.
Actor Allu Arjun leaves from Chikkadpally police station
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)