Hyd Man Dies in Russia-Ukraine War: రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన హైదరాబాద్ వాసి, ఉద్యోగంలో మోసపోయి రష్యన్ ఆర్మీలో చేరిన మృతుడు

ఈ విషయాన్ని మాస్కోలోని భారత రాయబార కార్యాలయ అధికారులు బుధవారం వెల్లడించారు.

Representative image. (Photo Credits: Unsplash)

ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో రష్యా తరపున పోరాడుతూ హైదరాబాద్ నగరానికి చెందిన మహ్మద్‌ అఫ్సాన్‌(30) అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయాన్ని మాస్కోలోని భారత రాయబార కార్యాలయ అధికారులు బుధవారం వెల్లడించారు. మహ్మద్ అస్ఫాన్‌ను రష్యా నుంచి హైదరాబాద్‌కు తీసుకొచ్చేందుకు సాయం కోసం అతడి కుటుంబుం ఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఓవైసీని సంప్రదించింది. ఎంఐఎం మాస్కోలోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించగా.. అస్ఫాన్‌ మరణించినట్లు అక్కడి అధికారులు ధృవీకరించారు. మృతిడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

కాగా ఉద్యోగం విషయంలో మోసపోవడంతో ఆఫ్సాన్‌ రష్యన్‌ ఆర్మీలో బలవంతంగా చేరాల్సి వచ్చినట్లు సమాచారం. రష్యా సైన్యానికి సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న దాదాపు 20 మంది భారతీయులను తీసుకొచ్చేందుకు తాము ప్రయత్నిస్తున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపిన కొద్ది రోజులకే ఈ విషాదం వెలుగుచూసింది.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)