Prakash Raj on Konda Surekha Comments: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు… సినిమాల్లో నటించే ఆడవాళ్ళంటే చిన్న చూపా? ఎక్స్ వేదికగా నటుడు ప్రకాష్ రాజ్ ట్వీట్

కేటీఆర్‌ను ఉద్దేశించి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను ఆయన పోస్ట్ చేస్తూ, "ఏంటీ సిగ్గులేని రాజకీయాలు… సినిమాల్లో నటించే ఆడవాళ్ళంటే చిన్న చూపా?.. #justasking" అని ట్వీట్‌లో ఆవేదన వ్యక్తం చేశారు.

Prakash Raj

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ ఎక్స్ వేదికగా స్పందించారు. కేటీఆర్‌ను ఉద్దేశించి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను ఆయన పోస్ట్ చేస్తూ, "ఏంటీ సిగ్గులేని రాజకీయాలు… సినిమాల్లో నటించే ఆడవాళ్ళంటే చిన్న చూపా?.. #justasking" అని ట్వీట్‌లో ఆవేదన వ్యక్తం చేశారు.

నాగచైతన్య, సమంత విడిపోవడానికి కేటీఆరే కారణమని, చాలామంది హీరోయిన్లు తొందరగా పెళ్లి చేసుకొని సినిమా ఫీల్డు నుంచి తప్పుకోవడానికి కారణం కూడా కేటీఆరేనని సురేఖ సంచలన ఆరోపణలు చేసిన సంగతి విదితమే.

హీరోయిన్ల జీవితాలతో ఆడుకోవడం కేటీఆర్‌కు అలవాటే, కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు, సమంత, నాగచైతన్య విడిపోవడానికి కారణం అతడే అంటూ..

Here's Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement