Break for Prajavani: తెలంగాణలో 'ప్రజావాణి'కి బ్రేక్.. లోక్ సభ ఎన్నికల కోడ్ కారణంగా నిలిపివేత.. మళ్లీ ఎప్పుడు మొదలవుతుందంటే??
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ కారణంగా ప్రజావాణి కార్యక్రమానికి బ్రేక్ పడింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల సమస్యల పరిష్కారం కోసం హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
Hyderabad, Mar 19: లోక్ సభ ఎన్నికల (Loksabha Elections) నేపథ్యంలో ఎన్నికల కోడ్ (Elections Code) అమల్లోకి వచ్చింది. ఈ కారణంగా ప్రజావాణి కార్యక్రమానికి బ్రేక్ (Break for Prajavani) పడింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల సమస్యల పరిష్కారం కోసం హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అయితే ఎన్నికల కోడ్ కారణంగా అధికారులు దీనిని రద్దు చేశారు. ఎన్నికలు పూర్తయి ఫలితాలు వచ్చిన తర్వాత జూన్ 7న తిరిగి యథాతథంగా ప్రజావాణి కార్యక్రమం ప్రారంభమవుతుందని వారు వెల్లడించారు. జిల్లాల్లోనూ ప్రజావాణిని రద్దు చేసినట్లు ఆయా జిల్లాల కలెక్టర్లు వెల్లడించారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)