Kesineni Nani on Prashant Kishore: చెప్పినవన్నీ జరగడానికి ప్రశాంత్ కిశోర్ ఏమీ దేవుడు కాదు, కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు వీడియో ఇదిగో..

విజయవాడ ఎంపీ కేశినేని నాని ప్రశాంత్ కిశోర్ అంచనాలపై స్పందించారు. ప్రశాంత్ కిశోర్ చెప్పినవి పట్టించుకోవాల్సి అవసరం లేదని అన్నారు. ఇటీవల ఆయన చెప్పినవి ఏవీ నిజం కాలేదని అన్నారు.తెలంగాణ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ గెలిచి మళ్లీ అధికారంలోకి వస్తుందని చెప్పాడు... కానీ ఓడిపోయింది.

MP kesineni Nani (Photo-Video Grab)

విజయవాడ ఎంపీ కేశినేని నాని ప్రశాంత్ కిశోర్ అంచనాలపై స్పందించారు. ప్రశాంత్ కిశోర్ చెప్పినవి పట్టించుకోవాల్సి అవసరం లేదని అన్నారు. ఇటీవల ఆయన చెప్పినవి ఏవీ నిజం కాలేదని అన్నారు.తెలంగాణ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ గెలిచి మళ్లీ అధికారంలోకి వస్తుందని చెప్పాడు... కానీ ఓడిపోయింది. రాజస్థాన్ లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందన్నాడు... కానీ ఓడిపోయింది. ప్రశాంత్ కిశోర్ వీడియోను నేను కూడా చూశాను. నా దగ్గర డేటా లేదు కానీ, నాకెందుకో అనిపిస్తోంది జగన్ ఓడిపోతాడని.. అంటూ ప్రశాంత్ కిశోర్ చెప్పాడు.

కానీ ఆయన చెప్పినవన్నీ తప్పులే. తెలంగాణలో ఆయన అంచనా తప్పింది, రాజస్థాన్ లో ఆయన అంచనా తప్పింది... అక్కడ భారీ మెజారిటీతో బీజేపీ గెలిచింది. చెప్పినవన్నీ జరగడానికి ప్రశాంత్ కిశోర్ ఏమీ దేవుడు కాదు. ప్రశాంత్ కిశోర్ చెప్పినవన్నీ ఇటీవల కాలంలో ఫెయిల్ అవుతున్నాయన్న విషయాన్ని ప్రజలు గమనించాలి" అని కేశినేని నాని పేర్కొన్నారు. ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యలు వెనుక అసలు నిజం ఇదేనా, ఒక పీకే సరిపోక మరో పీకేని తెచ్చుకున్నారని వైసీపీ నేతలు కౌంటర్,గతంలో ఆయన అంచనాలు రిపోర్ట్ ఇదే..

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now