Chandrababu and Prashanth Kishor (FB and ANI)

Vjy, Mar 4: ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై ప్రముఖ రాజకీయ వ్యూహ కర్త ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి విదితమే. ఈ ఎన్నికల్లో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఓడిపోవడం ఖాయమని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లో జరిగిన ఓ ఈవెంట్ లో పాల్గొన్న ఆయన.. ఏపీ ప్రజలు ఉచిత పథకాల కంటే అభివృద్ధికి పట్టం కడతారని జోస్యం చెప్పారు.

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత చంద్రశేఖర్ రావు ని, జగన్ ఫాలో అవుతున్నారని.. తెలంగాణలో కేసీఆర్ కి ఎదురైన పరాభవమే ఆంధ్రాలో జగన్ కూడా ఎదుర్కొంటారన్నారు. ఉచిత పథకాల ద్వారా ప్రజలకు డబ్బు పంచి ఎన్నికల్లో గెలుస్తామనుకోవడం మూర్ఖత్వం అంటూ కౌంటర్ విసిరారు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ భారీ విజయం సాధించే అవకాశాలున్నాయన్నారు. దీనికి వైసీపీ నేతలు కౌంటర్ విసురుతున్నారు.

వైఎస్సార్సీపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదలకు ముహూర్తం ఫిక్స్.. ఈ నెల 10న విడుదలకు నిర్ణయం.. ఈసారి కూడా సంక్షేమానికే పెద్దపీట

మాజీ మంత్రి పేర్ని నాని ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చాడు. ఒక పీకే వల్ల కావడం లేదని చంద్రబాబు మరొక పీకేను తెచ్చుకున్నాడని ఎద్దేవా చేశాడు. పవన్ కళ్యాణ్, చంద్రబాబుతో పాటు పీకే కూడా అబద్దాల పోటీలో ఛాంపియన్ అని అన్నాడు. రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ ఏమీ చేయలేకపోతున్నాడని, అందుకే చంద్రబాబు ప్రశాంత్ కిషోర్ ను తెచ్చుకున్నాడని అన్నారు. బీహార్ లో ప్రశాంత్ కిషోర్ ఓడిపోబోతున్నాడని, ఏపీలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు చిత్తుగా చిత్తుగా ఓడిపోవడం ఖాయం అని అన్నారు.

సంక్షేమం మాత్రమే చేస్తే గెలవరని అంటున్న పీకే మ్యానిఫెస్టోల్లో ఎడాపెడా సంక్షేమ పథకాలు పెట్టమని చంద్రబాబుకు సలహా ఎందుకిచ్చాడని ప్రశ్నించాడు. రాష్ట్రంలో అభివృద్ధి లేకపోతే గత ఐదేళ్లుగా అన్ని రంగాల్లో ముందంజలో ఎలా ఉందని ప్రశ్నించాడు. తాను ,మహామాంత్రికుడిని అని చెప్పుకుంటున్న ప్రశాంత్ కిషోర్ సొంత రాష్ట్రంలో బిహర్లో తన పార్టీని ఎందుకు గెలిపించలేకపోయాడని అన్నారు. పీకే రాజకీయ బిచ్చగాడిగా మారిపోయాడని అన్నారు. ఇంట గెలవని వాడు రచ్చ ఎలా గెలవగలడని అన్నారు.

Here's PK Statement Video

మంత్రి గుడివాడ అమర్‌నాథ్ మాట్లాడుతూ..ఒక పీకే సరిపోడని, రెండో పీకేని తెచ్చుకున్నారని మంత్రి అమర్‌నాథ్ ఎద్దేవా చేశారు. ప్రశాంత్ కిషోర్‌తో చంద్రబాబు రెండు మూడు గంటలు భేటీ అయ్యారని తెలిపారు. చంద్రబాబు, పీకే చెల్లని రూపాయలని విమర్శించారు. బీహార్‌లో చెల్లని రూపాయి ఇక్కడ చెల్లుతుందా? అని ప్రశ్నించారు. గతంలో సంక్షేమం లేదని, అభివృద్ధి లేదని అన్నారు. పీకే సర్వేలు ప్రజలు నమ్మరని మంత్రి అమర్‌నాథ్ కొట్టిపారేశారు.

Vijayasai Reddy Reaction

YSRCP Tweet

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎక్స్ లో పెట్టిన పోస్టులో ప్రశాంత్ కిషోర్ అంచనాలపై ఆధారపడొద్దంటూ (నమ్మొద్దంటూ) సూచించారు. చంద్రబాబుతో నాలుగు గంటల భేటీ తర్వాత లాజిక్ లేకుండా ప్రశాంత్ కిషోర్ ఈ వ్యాఖ్యలు చేశారంటూ విమర్శలు గుప్పించారు. అలాగే వర్తమాన రాజకీయాల్లో ఆయన అంచనాలకు, వాస్తవాలకూ పొంతన లేదన్నారు. ఏపీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు కోవిడ్ సమయంలో కోట్లాది మందికి అండగా నిలిచాయని, ఇవి ప్రజలకు భారీగా భద్రత నిచ్చాయని సాయిరెడ్డి గుర్తుచేశారు.

ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యలపై మంత్రి అంబటి రాంబాబు ట్విట్టర్ వేదికగా సెటైర్ వేశారు. 2019 ఎన్నికలపై ప్రీ సర్వే చేసిన లగడపాటి రాజగోపాల్ రాజకీయ సన్యాసం తీసుకున్నాడని, ఇప్పడు ప్రశాంత్ కిషోర్ కూడా దానికి సిద్దంగా ఉన్నాడని కౌంటర్ ఇచ్చారు. " నాడు లగడపాటి సన్యాసం తీసుకున్నాడు! ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ సిద్ధంగా ఉన్నాడు! " అని ఎక్స్ లో రాసుకొచ్చారు. కాగా హైదరాబాద్ లో జరిగిన ఓ చర్చ కార్యక్రమంలో పాల్గొన్న ప్రశాంత్ కిశోర్ ఏపీ ఎన్నికల్లో సీఎం జగన్ ఘోర పరాజయం చవి చూస్తాడని చెప్పారు. ప్రజల సొమ్ము పంచుతూ.. ప్రజల సంక్షేమం చూస్తున్నామనడం వల్ల రాజకీయంగా నష్టపోతున్నాడని అన్నారు. అంతేగాక ప్యాలెస్ లో కూర్చొని బటన్లు నొక్కితే ఓట్లు రాలవని హాట్ కామెంట్స్ చేశాడు.

లైవ్ డిబేట్ లో చితక బాదుకున్న వైసీపీ, జనసేన అనలిస్టులు...లం. కొడకా అంటూ బూతులు..

ఇదిలా ఉంటే గతంలో పీకే చెప్పిన అంచనాలు తప్పాయి. తెలంగాణలో కేసీఆర్ గెలుస్తారని చెప్పారు. కానీ, గెలవలేదు. మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్ లో బీజేపీకి వ్యతిరేకంగా అంచనాలు వెల్లడించారు. రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీనే గెలిచింది. 2019 ఎన్నికల సమయంలో ఆంధ్ర ఆక్టోపస్ గా పిలుచుకొనే లగడపాటి రాజగోపాల్ టీడీపీ గెలుస్తుందని ధీమాగా చెప్పారు.

ఆ ఎన్నికల్లో వైసీపీ గెలిచింది. ఆ తరువాత రాజగోపాల్ పూర్తిగా ఎన్నికల సర్వేలకు దూరంగా ఉంటున్నారు. చంద్రబాబుకు అనుకూలంగా పని చేస్తున్న పీకే, ప్రస్తుతం బీజేపీ తో పొత్తు పైన వస్తున్న వ్యతిరేక ప్రచారం దారి మళ్లించటానికి ఈ రకమైన వ్యాఖ్యలు చేసి మైండ్ గేమ్ ఆడుతున్నారనేది వైసీపీ నేతల వాదన. మరి..పీకే జోస్యం నిజమవుతుందా.. వైసీపీ ధీమా గెలుస్తుందా అనేది ఎన్నికల ఫలితాలు స్పష్టం చేయనున్నాయి.