Hyderabad Zoo Employee Death: హైదరాబాద్ జూలో ఉద్యోగిపై ఏనుగు దాడి... నేలకేసి కొట్టి చంపిన ఏనుగు
హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ లో దిగ్భ్రాంతికర సంఘటన చోటు చేసుకుంది. జూలో ఉన్న ఓ ఏనుగు దాడి చేయడంతో, జూ ఉద్యోగి ఒకరు మరణించారు. షైబాజ్ అనే వ్యక్తి హైదరాబాద్ జూలో యానిమల్ కీపర్ గా పనిచేస్తున్నాడు.
Hyderabad, Oct 8: హైదరాబాద్ (Hyderabad) నెహ్రూ జూలాజికల్ పార్క్ లో (Zoo Park) దిగ్భ్రాంతికర సంఘటన చోటు చేసుకుంది. జూలో ఉన్న ఓ ఏనుగు (Elephant) దాడి చేయడంతో, జూ ఉద్యోగి ఒకరు మరణించారు. షైబాజ్ అనే వ్యక్తి హైదరాబాద్ జూలో యానిమల్ కీపర్ గా పనిచేస్తున్నాడు. అయితే, ఏనుగు అదుపుతప్పి ప్రవర్తించడంతో షైబాజ్ మృత్యువాతపడ్డాడు. 28 ఏళ్ల షైబాజ్ మృతితో అతడి కుటుంబంలో విషాదం నెలకొంది. నెహ్రూ జూ పార్క్ 60 ఏళ్ల ఉత్సవం సందర్భంగా ఇతర ఉద్యోగులు వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్లగా, ఏనుగుల ఎన్ క్లోజర్ లో షైబాజ్ ఒక్కడే విధుల్లో ఉన్నాడు. అయితే, ఒక్కసారిగా ముందుకొచ్చిన ఏనుగు అతడిని నేలకేసి విసిరికొట్టింది. ఏనుగు దాడిలో షైబాజ్ కు తీవ్ర గాయాలు కాగా, అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతడు మరణించాడు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)