Telangana: గురుకులంలో అడిషనల్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీ..షాక్ తిన్న వైనం, రోజు వారి కూలీలతో వంట..కుళ్లిన గుడ్లు,నీళ్ల సాంబార్...వీడియో ఇదిగో
గురుకులంలో తనిఖీకి వెళ్లి ఖంగుతిన్నారు ఆసిఫాబాద్ అడిషనల్ కలెక్టర్. ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలోని మొగడ్ ధగడ్ ఆశ్రమ పాఠశాలలో తనిఖీకి వెళ్లారు అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ. వంట మనిషి లేకపోవడంతో రోజువారీ కూలీలతో వంట చేయిస్తున్నారు. స్టోర్ రూంలో కుళ్లి బూజు పట్టిన ఆలుగడ్డలు, ఐఎస్ఐ మార్క్ లేని ఉప్పు ప్యాకెట్లు దర్శనం ఇచ్చాయి.

అలాగే మెనూ ప్రకారం పప్పు వండాల్సి ఉండగా నీళ్ల సాంబార్ వండారు వంట కూలీలు. అడిషనల్ కలెక్టర్ వస్తున్నాడని కొన్ని గుడ్లు ఉడికించగా అవి కుళ్లిపోయిన పరిస్థితి నెలకొంది. పిల్లలకు ఇప్పటివరకు యూనిఫాంలు ఇవ్వలేదు.. చలికాలం ప్రారంభమైనా ఇప్పటికీ బ్లాంకెట్లు అందలేదు. దీంతో గురుకులం తనిఖీలో విస్తూ పోయే నిజాలు చూసి ఖంగుతిన్నారు అడిషనల్ కలెక్టర్. వీడియో ఇదిగో, వాంటో సుట్‌కేస్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం, ప్రాణ నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు
Here's Video: