Telangana Election 2023 Results: పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ, రెండవ స్థానంలో బీఆర్ఎస్ పార్టీ, పోటీలో లేని బీజేపీ
తెలంగాణలో పోస్టల్ బ్యాలెట్లలో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతోంది. అధికార బీఆర్ఎస్ పార్టీ రెండవస్థానంలో కొనసాగుతోంది. ఇక బీజేపీ పూర్తిగా వెనుకబడిపోయింది.
Assembly Election 2023 Results Live News Updates: ఐదు రాష్ట్రాల్లో హోరాహోరీగా సాగిన ఎన్నికల సమరం ముగిసింది.ఐదో రాష్ట్రమైన మిజోరంలో ఓట్ల లెక్కింపు సోమవారానికి వాయిదా పడింది. ఓటింగ్ యంత్రాల్లో నిక్షిప్తమైన నేతల భవితవ్యం నేడు వెల్లడి కానుంది. కీలకమైన 2024 లోక్‌సభ ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా భావిస్తున్న నేపథ్యంలో ఫలితాలపై దేశవ్యాప్తంగా అందరిలోనూ ఆసక్తి నెలకొంది. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఆదివారం ఓట్ల లెక్కింపు జరిగి ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. తెలంగాణలో పోస్టల్ బ్యాలెట్లలో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతోంది. అధికార బీఆర్ఎస్ పార్టీ రెండవస్థానంలో కొనసాగుతోంది. ఇక బీజేపీ పూర్తిగా వెనుకబడిపోయింది.
కామారెడ్డి, కరీంనగర్‌లో బీజేపీ ముందంజ
నల్గొండలో కాంగ్రెస్ ముందంజ
చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలో అక్బరుద్దీన్(ఎంఐఎం) ముందంజ
ఖమ్మం, మధిరలో కాంగ్రెస్ అభ్యర్థులు తుమ్మల, భట్టి ముందంజ
హుజూరాబాద్‌లో ఈటల ముందంజ
కొడంగల్‌లో రేవంత్ రెడ్డి ముందంజ
పరిగి, వికారాబాద్, తాండూరులో ముందంజలో కాంగ్రెస్ అభ్యర్థులు
వేములవాడలో కాంగ్రెస్ ముందంజ
సిరిసిల్లలో కేటీఆర్ ముందంజ
పాలేరు లో పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ అభ్యర్ధి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, కల్వకుర్తిలో.. ఇంకా మొదలుకాని పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు
Here's Live Results
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)