CM Revanth Reddy Phone Call to Priest Rangarajan: చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఫోన్, దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు
చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్‌పై దాడి ఘటన తెలంగాణలో తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) స్పందించారు. ఈ మేరకు రంగరాజన్‌కు ఫోన్ చేసి పరామర్శించారు. ఘటనపై ఆరా తీసిన సీఎం.. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.
చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్‌పై దాడి ఘటన తెలంగాణలో తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) స్పందించారు. ఈ మేరకు రంగరాజన్‌కు ఫోన్ చేసి పరామర్శించారు. ఘటనపై ఆరా తీసిన సీఎం.. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. హోంమంత్రి కూడా అయిన ముఖ్యమంత్రి ప్రధాన పూజారితో ఫోన్‌లో మాట్లాడి దాడిపై సానుభూతి వ్యక్తం చేశారు. ఇలాంటి దాడులను సహించబోమని అన్నారు.
అర్చకుడు రంగరాజన్‌పై దాడిలో మరో అయిదుగురు అరెస్ట్, ఐదుగురు నిందితులలో ఇద్దరు మహిళలు, వీడియో ఇదిగో..
చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్‌పై దాడి ఘటనపై రాజేంద్రనగర్ డీసీపీ సీహెచ్.శ్రీనివాస్ కీలక ప్రకటన చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు వీరరాఘవరెడ్డి, ఇద్దరు మహిళలు సహా మొత్తం ఆరుగురిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ‘‘ఈ ఉదయం ఐదుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించాం. నిందితులు ఖమ్మం, నిజామాబాద్‌కు చెందినవారు. ప్రధాన నిందితుడు వీర రాఘవరెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్నాం. తమకు ఆర్థికంగా సాయం చేయాలని, రామరాజ్యంలో సభ్యుల్ని చేర్పించాలని రంగరాజన్‌ను డిమాండ్ చేశారు. అందుకు నిరాకరించడంతో ఆయనపై దాడి చేశారు’’ అని డీసీపీ వివరించారు.
CM Revanth Reddy Calls Priest Rangarajan:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)