Attack on Chilkur Temple Chief Priest (Photo-X/Video Grab)

Hyd, Feb 10: చిలుకూరులోని ప్రసిద్ధ బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్‌పై జరిగిన దాడి కేసులో మరో అయిదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఐదుగురు నిందితులలో ఇద్దరు మహిళలు ఖమ్మం, నిజామాబాద్ జిల్లాలకు చెందినవారు. అరెస్టు చేసిన వారందరినీ కోర్టు ముందు హాజరుపరుస్తున్నట్లు రాజేంద్రనగర్ జోన్ DCP Ch. శ్రీనివాస్ తెలిపారు.

ఆదివారం, పోలీసులు శ్రీరామరాజ్యం సంస్థ వ్యవస్థాపకుడు, ప్రధాన నిందితుడు మణికొండ నివాసి, తూర్పుగోదావరి జిల్లా, అన్నపర్తి మండలం కొప్పూరు గ్రామానికి చెందిన కొవ్వూరి వీర్ రాఘవ రెడ్డి (45) ను అరెస్టు చేసి, జ్యుడీషియల్ కస్టడీకి తరలించిన సంగతి విదితమే.

ఇది సనాతన ధర్మంపై జరిగిన దాడి, చిలుకూరు బాలాజీ ప్రధానార్చకుడు శ్రీ రంగరాజన్‌పై జరిగిన దాడిని ఖండించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

చిలుకూరు సీఐ పవన్‌కుమార్‌ కథనం ప్రకారం శుక్రవారం రంగరాజన్‌ ఇంటికి కొందరు వ్యక్తులు వచ్చారు. రామరాజ్య స్థాపన కోసం తమతో కలిసి పని చేయాలని, సైన్యాన్ని తయారు చేయాలని కోరారు. ఉగాది వరకు సమయం ఇస్తున్నామని, సహకరించకుంటే నిన్ను ఎవరూ కాపాడలేరని హెచ్చరించారు. రంగరాజన్‌ అంగీకరించకపోవడంతో వాగ్వాదం జరిగింది.

Attack on Chilkur Temple Chief Priest:

దీంతో నిందితులు రంగరాజన్‌పై దాడికి పాల్పడ్డారు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా కేసు దర్యాప్తు జరిపామని, ప్రధాన నిందితుడు వీరరాఘవరెడ్డిని ఆదివారం అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించామని వెల్లడించారు.