IMAX: హైదరాబాద్‌ లోని ఐమ్యాక్స్‌ లో అర్ధరాత్రి రభస.. శుక్రవారం రాత్రి ‘గణ్‌పత్’ సినిమా ప్రదర్శిస్తుండగా అకస్మాత్తుగా వెలువడిన దుర్వాసన.. స్ప్రే చేసినా మెరుగుపడని పరిస్థితి.. టిక్కెట్టు డబ్బులు తిరిగిచ్చేసిన యాజమాన్యం

హైదరాబాద్‌ లోని ఐమ్యాక్స్ థియేటర్‌ లో శుక్రవారం రాత్రి నానా రభస జరిగింది. టైగర్ ష్రాఫ్ నటించిన గణ్‌పత్ సినిమా ప్రదర్శిస్తుండగా థియేటర్లో అకస్మాత్తుగా దుర్వాసన వెలువడటంతో ప్రేక్షకులు ఇబ్బందుల పాలయ్యారు.

IMAX (Credits: X)

Hyderabad, Oct 21: హైదరాబాద్‌ (Hyderabad) లోని ఐమ్యాక్స్ (IMAX) థియేటర్‌ లో శుక్రవారం రాత్రి నానా రభస జరిగింది. టైగర్ ష్రాఫ్ నటించిన గణ్‌పత్ సినిమా ప్రదర్శిస్తుండగా థియేటర్లో అకస్మాత్తుగా దుర్వాసన వెలువడటంతో ప్రేక్షకులు ఇబ్బందుల పాలయ్యారు. వెంటనే అప్రమత్తమైన థియేటర్ సిబ్బంది అక్కడ స్ప్రే చేసినా పరిస్థితి మెరుగుపడలేదు.  ఈ క్రమంలో సుమారు అరగంట పాటు వేచి చూసిన ప్రేక్షకులు చివరకు సహనం కోల్పోయి నిరసనకు దిగారు. అందరూ బయటకు వచ్చి టిక్కెట్టు డబ్బులు తిరిగివ్వాలంటూ డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఘటనాస్థలానికి పోలీసులు చేరుకున్నారు. చివరకు థియేటర్ యాజమాన్యం టిక్కెట్ డబ్బులు తిరిగివ్వడంతో ప్రేక్షకులు వెనుదిరిగారు.

IMAX (Credits: X)

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now