Telangana: జనగామ జిల్లాలో బ్యాంక్ అధికారుల ఓవరాక్షన్.. అప్పు కట్టలేదని ఇంటి ముందు పొయ్యి పెట్టి వంటావార్పు, షాకింగ్ వీడియో
అప్పు కట్టలేదని ఇంటి ముందు బ్యాంకు అధికారులు పొయ్యి పెట్టిన సంఘటన తెలంగాణ(Telangana)లోని జనగామ(Jangaon) జిల్లాలో చోటు చేసుకుంది.
అప్పు కట్టలేదని ఇంటి ముందు బ్యాంకు అధికారులు పొయ్యి పెట్టిన సంఘటన తెలంగాణ(Telangana)లోని జనగామ(Jangaon) జిల్లాలో చోటు చేసుకుంది. దేవరుప్పుల మండలం పెదతండాకు చెందిన గుగులోత్ లక్ష్మి తెలంగాణ గ్రామీణ బ్యాంకులో(Telangana Grameena Bank ) మహిళా సంఘంలో రుణం తీసుకొని, రూ.61 వేలు అప్పు పడింది.
అప్పు కట్టాలని గుగులోత్ లక్ష్మి ఇంటి ముందు పొయ్యి పెట్టి బ్యాంక్ అధికారులు వంటావార్పు చేశారు. బ్యాంకు అధికారుల(Bank Officials) తీరును అంతా తప్పుబడుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మరోవైపు నిర్మల్జి ల్లాలోని ముధోల్ మండలం అష్టా గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఫించన్ డబ్బులు ఇవ్వలేదని కన్న తల్లినే కడతేర్చాడు ఓ కసాయి కొడుకు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఫించన్ డబ్బులు ఇవ్వలేదని కన్న తల్లినే కడతేర్చిన కసాయి కొడుకు.. నిర్మల్ జిల్లాలోని ముధోల్ మండలం అష్టా గ్రామం
Bank Officials Place Stove Outside House Over Unpaid Loan at Jangaon
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)