Bird Flu Effect: బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్... 24 గంటల్లో 10వేల కోళ్లు మృతి, ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణకు కోళ్లు రాకుండా పోలీసులు ముమ్మర తనిఖీలు,కొద్ది రోజులు చికెన్ తినవద్దని అధికారుల సూచన
బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ తో( Bird Flu Effect) తెలుగు రాష్ట్రాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆంధ్ర-తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో తనిఖీలు ముమ్మరం చేశారు.
బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ తో( Bird Flu Effect) తెలుగు రాష్ట్రాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆంధ్ర-తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో తనిఖీలు ముమ్మరం చేశారు. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం అనుమోలులంకలోని శ్రీ బాలాజీ ఫౌల్ట్రీ ఫామ్ లో( Bird Flu) భారీగా కోళ్లు మృత్యువాత పడ్డాయి.
చనిపోయిన కోళ్లను జనావాసాలకు దూరంగా డిస్పోజ్ చేయాలని సూచించారు వెటర్నరీ అధికారులు. అధికారుల సూచన మేరకు చనిపోయిన కోళ్లను భూమిలో పూడ్చిపెట్టారు ఫౌల్ట్రీ యజమాని. బర్డ్ ఫ్లూ వచ్చిన ప్రాంతాల్లోని పౌల్ట్రీలు, చికెన్ షాపులు, కోళ్లు, గుడ్లను పుడ్చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
బర్డ్ ఫ్లూ నేపథ్యంలో ఆంధ్ర-తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో తనిఖీలు చేపట్టారు. రామాపురం ఎక్స్ రోడ్డులోని అంతర్రాష్ట్ర చెక్‌పోస్ట్ వద్ద తనిఖీలు చేశారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం నల్లబండగూడెం వద్ద ఉన్న అంతర్రాష్ట్ర చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు, వెటర్నరీ డాక్టర్ల తనిఖీలు చేపట్టగా ఆంధ్ర నుంచి సరఫరా అయ్యే కోళ్లకు సంబంధించి వాహనాలను తనిఖీ చేసి వాటిని తెలంగాణలోకి రాకుండా జాగ్రత్తలు చేపట్టారు.
Bird Flu Effect: Inspections at Andhra-Telangana Border
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)