Vijayashanthi on MLA Raja Singh: మళ్లీ బీజేపీలో అగ్గి రాజేసిన విజయశాంతి, ఎమ్మెల్యే రాజాసింగ్ సస్పెన్షన్ అంశంలో బీజేపీ లేట్ చేస్తోందని ట్వీట్

తెలంగాణలో​ బీజేపీలో అంతర్గత వార్ కొనసాగుతూనే ఉంది. జితేందర్ రెడ్డి..బండి సంజయ్ మీద చేసిన ట్వీట్ వేడి చల్లారక ముందే నటి, బీజేపీ నేత విజయశాంతి మరో ట్వీట్ తో అగ్గి రాజేశారు. విజయశాంతి.. రాజాసింగ్ సస్పెన్షన్‌పై ట్విట్టర్‌లో సంచలన పోస్ట్‌ చేశారు.

Vijayashanthi (Photo-Twitter)

తెలంగాణలో​ బీజేపీలో అంతర్గత వార్ కొనసాగుతూనే ఉంది. జితేందర్ రెడ్డి..బండి సంజయ్ మీద చేసిన ట్వీట్ వేడి చల్లారక ముందే నటి, బీజేపీ నేత విజయశాంతి మరో ట్వీట్ తో అగ్గి రాజేశారు. విజయశాంతి.. రాజాసింగ్ సస్పెన్షన్‌పై ట్విట్టర్‌లో సంచలన పోస్ట్‌ చేశారు. ఎమ్మెల్యే రాజాసింగ్ సస్పెన్షన్ అంశంలో బీజేపీ నిర్ణయం కొంత ఆలస్యమవుతున్నట్లు మన కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారని తెలిపారు.

అయితే, బండి సంజయ్ గారితో సహా తెలంగాణ రాష్ట్ర పార్టీ అంతా ఆ సస్పెన్షన్ తియ్యబడాలని మనఃపూర్వకంగా కోరుకుంటున్నామని వెల్లడించారు. అలాగే జరుగుతుందని నమ్ముతున్నాం. ప్రపంచంలోనే అత్యధిక సభ్యులు, కార్యకర్తలు ఉన్న భారతీయ జనతా పార్టీ తన కార్యకర్తలకు న్యాయం చేసుకోకుంటే ఇంత శక్తి వస్తదా… సరైన సమయంలో అంతా మంచే జరుగుతుంది. అంటూ ట్వీట్ చేశారు. విజయశాంతి చేసిన ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. బీజేపీ కార్యకర్తలు ఆమె ట్వీట్‌పై స్పందిస్తున్నారు.

Here's Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement